చంద్రహాస్.. ఈ పేరు వినగానే సోషల్ మీడియాలో ఒక రేంజ్ హంగామా కనిపిస్తుంది. నటుడు ప్రభాకర్ తనయుడిగా కాకుండా, తనకంటూ ఒక సెపరేట్ మాస్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న చంద్రహాస్, ఇప్పుడు 'బరాబర్ ప్రేమిస్తా' సినిమాతో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో ఆది సాయికుమార్ పాల్గొని చంద్రహాస్ హార్డ్ వర్క్ గురించి మాట్లాడిన మాటలు ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇస్తున్నాయి.ఈవెంట్‌లో ఆది సాయికుమార్ మాట్లాడుతూ చంద్రహాస్‌ను బాలీవుడ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్‌తో పోల్చడం విశేషం. "చంద్రహాస్ వీడియోలు నేను సోషల్ మీడియాలో చూస్తుంటాను. వాడి డ్యాన్సులు, జిమ్నాస్టిక్స్ చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. పక్కా టైగర్ ష్రాఫ్ లాగా అద్భుతమైన ఫ్లిప్స్ చేస్తాడు. ఇంత కష్టపడుతున్నాడు కాబట్టే కచ్చితంగా వాడు ఒక మంచి హీరో అవుతాడు" అని ఆది కొనియాడారు.కేవలం యాటిట్యూడ్ మాత్రమే కాదు, నటనలో కూడా చంద్రహాస్ చాలా హానెస్ట్ గా ట్రై చేస్తున్నాడని, ఈ సినిమాతో వాడికి ఒక పెద్ద బ్రేక్ రావాలని ఆది ఆకాంక్షించారు.


ఈ ఈవెంట్‌లో ఆది సాయికుమార్ మరియు వెర్సటైల్ యాక్టర్ జెడి చక్రవర్తి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ హైలైట్‌గా నిలిచింది. ఆది తన స్పీచ్‌లో జెడి గారితో కలిసి స్టేజ్ పంచుకోవడం సంతోషంగా ఉందని చెబుతూనే, సినిమాలో చంద్రహాస్ ఎనర్జీ గురించి చర్చించారు.దర్శకుడు సంపత్ రుద్ర తెరకెక్కించిన ఈ చిత్రం ప్యూర్ తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామా."ఒక ఊరిలో ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య వచ్చే గొడవలు, అవి ప్రేమగా ఎలా మారాయి అనేదే ఈ సినిమా కథ. ఇందులో చంద్రహాస్ తన మార్క్ 'యాటిట్యూడ్'తో పాటు మాస్ యాక్షన్ సీన్లలో కూడా అదరగొట్టాడట. ముఖ్యంగా మేఘనా ముఖర్జీతో అతని కెమిస్ట్రీ సినిమాకు ప్లస్ కానుంది."



సినిమాను ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ప్రమోషన్స్‌లో భాగంగా కాలేజీలకు వెళ్లినప్పుడు స్టూడెంట్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి చంద్రహాస్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. తనను ట్రోల్ చేసే వారికైనా, పొగిడే వారికైనా తన సినిమాతోనే సమాధానం చెబుతానని ధీమా వ్యక్తం చేశాడు. ఆర్ఆర్ ధ్రువన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. పాటలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి."ప్రభాకర్ గారి అబ్బాయిగా కాకుండా, ఒక నటుడిగా తన సొంత టాలెంట్‌తో చంద్రహాస్ గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఫిబ్రవరి 6న థియేటర్లకు వెళ్లి ఈ సినిమాను ఆదరించండి" అంటూ ఆది ప్రేక్షకులను కోరారు.మొత్తానికి 'బరాబర్ ప్రేమిస్తా' ప్రీ-రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే చంద్రహాస్ మీద ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తోంది. ఆది సాయికుమార్ లాంటి హీరోలు వచ్చి సపోర్ట్ చేయడం ఈ చిన్న సినిమాకు పెద్ద బూస్టింగ్ అని చెప్పాలి. మరి 'యాటిట్యూడ్ స్టార్' ఈసారి బాక్సాఫీస్ దగ్గర 'బరాబర్' విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: