గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు రెండోసారి తల్లిదండ్రులు కావడం మెగా అభిమానుల్లో అపారమైన ఆనందాన్ని నింపింది. ఈసారి వారికి కవల పిల్లలు జన్మించడంతో ఆ సంతోషం రెట్టింపు అయింది. అందులో ఒక మగబిడ్డ కూడా ఉండటంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా సంబరాల్లో మునిగిపోయారు.మెగా కుటుంబం మూడో తరంలో ఇప్పటివరకు వరుణ్ తేజ్‌కు మాత్రమే మగ సంతానం ఉండగా, మిగతా వారందరికీ ఆడపిల్లలే జన్మించారు. ముఖ్యంగా చిరంజీవి కుటుంబంలో ఆడపిల్లలే ఎక్కువగా ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో “ఒక కొడుకు పుడితే బాగుంటుంది” అని చిరంజీవి పలు సందర్భాల్లో చెప్పిన విషయం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. అంతేకాదు, రామ్ చరణ్ ‘అన్‌స్టాపబుల్’ షోలో పాల్గొన్నప్పుడు, ఆయన తల్లి పంపిన స్పెషల్ వీడియోలో కూడా మనవడు కావాలని కోరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కుటుంబ కోరిక నెరవేరడంతో ఇంట్లో ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది.

ఇక ఈ ఆనందకరమైన వార్తతో పాటు మరో ఆసక్తికరమైన అంశం సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. అదే… పుట్టిన ఈ కవల పిల్లలకు రామ్ చరణ్, ఉపాసన ఎలాంటి పేర్లు పెట్టబోతున్నారు అన్నది. మెగా ఫ్యామిలీలో పుట్టిన చాలా మంది పిల్లల పేర్లలో ఆంజనేయ స్వామి లేదా శ్రీరాముడికి సంబంధించిన అర్థం ఉండేలా జాగ్రత్త తీసుకుంటూ వచ్చారు. అయితే రామ్ చరణ్ఉపాసన తమ మొదటి కూతురికి మాత్రం ఆ సంప్రదాయానికి భిన్నంగా ‘క్లిన్ కారా’ అనే పేరును పెట్టారు. ఈ పేరు లలిత సహస్రనామం నుంచి తీసుకున్నదిగా అప్పట్లో విశేషంగా చర్చకు వచ్చింది.ఇప్పుడు జన్మించిన కవల పిల్లలకూ అలాంటి ఆధ్యాత్మిక భావన కలిగిన పేర్లే పెడతారా? లేక మళ్లీ ఆంజనేయ స్వామి లేదా శ్రీరాముడి పేరుతో అనుసంధానం అయ్యేలా ఎంపిక చేస్తారా? అన్నది అభిమానుల్లో ఉత్కంఠను కలిగిస్తోంది. ముఖ్యంగా మగబిడ్డకు ఎవరు పేరు పెట్టబోతున్నారు, ఏ తరహాలో పేరు ఉండబోతుంది అన్నదానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ తన చిన్న కుమారుడికి తన పేరు, అన్నయ్య చిరంజీవి పేరు కలిసొచ్చేలా ‘మార్క్ శంకర్ పవనోవిచ్’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. అదే తరహాలో రామ్ చరణ్ కూడా తన తండ్రి చిరంజీవి, బాబాయి పవన్ కళ్యాణ్ పేర్లతో అనుసంధానం అయ్యేలా తన కొడుక్కి పేరు పెడతాడా? అనే ఊహాగానాలు నెటిజన్లలో వినిపిస్తున్నాయి.మొత్తానికి, ఈ కవల పిల్లలకు రామ్ చరణ్ ఏ పేర్లు ఎంపిక చేస్తాడో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అప్పటివరకు మెగా అభిమానుల్లో ఈ ఆసక్తి తగ్గేలా మాత్రం కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: