అంబ‌టి రాంబాబు. వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి. మంచి మాటకారి.. వృత్తి రీత్యా న్యాయ‌వా ది కూడా. గ‌త ఏడాది ఓ వివాదంలో త‌న కేసును తానే వాదించుకుని విజ‌యం కూడా ద‌క్కించుకున్నారు. అలాంటి నాయ‌కుడు.. తాజాగా నోరు అదుపులో పెట్టుకోకుండా.. చేసిన వ్యాఖ్య‌లు.. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేత‌ల‌ను భ‌గ్గుమ‌నిపించాయి. ఒక్క టీడీపీ నాయ‌కులనే కాదు.. ప్ర‌జ‌ల‌ను కూడా మ‌రింత‌గా ర‌గిలేలా చేశాయి. ఇదిలావుంటే.. అంబ‌టి చేసిన వ్యాఖ్య‌ల‌ను జ‌గ‌న్ స‌మ‌ర్థించ‌డం పుండుపై కారం చ‌ల్లిన‌ట్టుగా మారింది.


స‌హ‌జంగా త‌ప్పులు జ‌ర‌గ‌డం వేరు. కానీ, ఉద్దేశ పూర్వ‌కంగా వ్యాఖ్య‌లు చేయ‌డం వేరు. ఇప్పుడు రెండో దే అంబ‌టి విష‌యంలో జ‌రిగింది. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన వెంట‌నే వైసీపీ దిద్దుబాటుకు దిగి ఉంటే.. ఆ ప‌రిస్థితి చేతులు కాలే దాకా వ‌చ్చేది కాదు. అంబ‌టి ఇంటిపై దాడులు.. కార్యాల‌యానికి నిప్పు పెట్టే ప‌రిస్థి తికి దారి తీసేది కూడా కాదు. కానీ.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. నేనున్నానంటూ.. అంబ‌టికి ఫోన్ చేసి ప‌రామ‌ర్శించ‌డం.. ఆయ‌న‌ను స‌మ‌ర్థించ‌డం వంటివి తీవ్ర వివాదాల‌కు దారితీసింది.


దీనివల్ల వైసీపీ సాధించింది ఏంటి? అంటే.. మ‌రింతగా చులకన అయింది. ప‌ద్దతి ఉన్న‌వారు ఎవ‌రూ ఆ పార్టీని ఆద‌రించే ప‌రిస్థితి లేకుండా పోయింది. గ‌త 18 మాసాల చ‌రిత్ర‌ను తీసుకుంటే.. 1) గంజాయి బ్యాచ్‌కు మ‌ద్ద‌తు ప‌లికార‌న్న దారుణ ముద్ర ప‌డింది. 2)  ర‌ప్పా-ర‌ప్పా బ్యాచ్‌ను ఖండించ‌క‌పోగా.. మ‌రింత‌గా వారిని పార్టీ కార్యాల‌యానికి పిలిచి.. వారికి మ‌ద్ద‌తు ఇచ్చార‌న్న అప‌ప్ర‌ద‌మూట‌గ‌ట్టుకున్నారు. 3) పార్టీలో అనుచిత వ్యాఖ్య‌లు చేసేవారిని క‌ట్ట‌డి చేయాల్సిందిపోయి.. వారిని ఎంక‌రేజ్ చేస్తున్నారు.


ఇలా.. ఒక‌టి కాదు.. అనేక రూపాల్లో వైసీపీ ఈ రోజు మ‌రింత భ్ర‌ష్టు ప‌ట్టింది. దీని నుంచి బ‌య‌ట ప‌డాల‌ని.. పార్టీని ప్ర‌జ‌ల‌కుచేరువ చేయాల‌ని ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు, మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వంటి వారు.. చెబుతున్న మాట‌లు వైసీపీకి వినిపించ‌డం లేదు. ఫ‌లితంగా ఆ పార్టీ జారుడు బండ‌పై.. మ‌రింత జోరుగా ప‌రుగులు పెడుతోంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇది అంతిమంగా ఆ పార్టీకి మేలు చేయ‌క‌పోగా.. మ‌రింత దిగ‌జారేలా చేస్తోంది. దీనికి అంబ‌టి ఉదంతం.. మ‌రింత ఆజ్యం పోసింది. ఇక‌, ఈ పార్టీని మార్చేవారు.. స‌రిచేసేవారు కూడా క‌నిపించ‌ర‌న్న టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: