
క సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి 15వ దాదా పాలికే ఫిలిం ఫెస్టివల్ 2025 బెస్ట్ ఫిలిం క్యాటగిరిలో నామినేషన్ అందుకుంది. అందుకు సంబంధించి ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు.. ఈ విషయాన్ని ప్రేక్షకులతో అభిమానులతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఒక పోస్టర్ని షేర్ చేయడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ విషయం తెలిసిన అటు అభిమానులు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు.
ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం తో పాటుగా తన్విరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. డైరెక్టర్ సుజిత్, సందీప్ డైరెక్షన్లో సంయుక్తంగా పెరకెక్కించారు. గత ఎడారి దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఆ తర్వాత వచ్చిన చిత్రాలు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి ఈ సినిమాకి సీక్వెల్ గా జరాకెక్కించే అవకాశం కూడా ఉన్నదంటూ తెలియజేశారు కిరణ్ అబ్బవరం. మొత్తానికి ఈ యంగ్ హీరో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన క సినమాకు అరుదైన అవకాశం లభించడంతో తన ఆనందాన్ని కూడా అభిమానులతో పంచుకుంటున్నారు.