జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన రెండవ చిత్రం దేవర. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించక సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు. అలాగే మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కూడా కీలకమైన పాత్రలో నటించారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా 500 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సినిమా పెరకెక్కించే సమయంలోనే రెండు భాగాలుగా ఉంటుందని చిత్ర బృందం ప్రకటించారు అందుకు తగ్గట్టుగానే సినిమా ఎండ్ లో దేవర 2 లీడ్ ఇస్తూ  కట్ చేయడం జరిగింది.


దీంతో కొరటాల శివ పైన కూడా మరింత భారం పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే దేవర మొదటి భాగంలో కొంతమేరకు నెగిటివ్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా దేవర 2 చిత్రాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించే విధంగా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు.. ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మొదలు పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు  సంబంధించి మరో రెండు వారాలలోపు ఒక వీడియోని కూడా విడుదల చేసేలా కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. అంటే ఎన్టీఆర్ బర్త్డే మే 20వ తేదీన ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


ముందు అనుకున్న కథను సైతం మార్పులు చేసుకొని కొరటాల శివ దేవర ఫ్లాష్ బ్యాక్ ని మరింత పీక్స్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈసారి విలన్ గా సైఫ్ అలీ ఖాన్ తో పాటు బాబి డియోల్ ని కూడా తీసుకువచ్చేలా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్ షూటింగ్ విషయానికి మాత్రం కొంతమేరకు ఆలస్యంగా ఉండేలా ఉన్నదట. ఎందుకంటే ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రంతో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ రెండిట్లో ఏదో ఒక సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే దేవర 2 సినిమా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: