
హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రియ కొంతం, చరణ్ పేరి, షాలిని కొండెపూడి, శ్రావణి లక్ష్మి, వంశీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. నిర్మాతగా శుభం సినిమాతో సమంతకు ఎలాంటి ఫలితం దక్కిందో ఇప్పుడు చూద్దాం.
కథ :
భీమిలిపట్నం ప్రాంతంలో జీవనం సాగించే 3 యువ జంటల కథాంశం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ముగ్గురు స్నేహితులలో ఇప్పటికీ పెళ్లి కాని శ్రీను (హర్షిత్) శ్రీవల్లి (శ్రియ కొంతం) ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెళ్లి జరిగినా సీరియల్ పిచ్చి ఉన్న భార్య వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. పెళ్లైన తన స్నేహితులను సైతం అలాంటి సమస్యలే వేధిస్తున్నాయని అతనికి తెలుస్తుంది.
సీరియల్ సమయంలో మహిళలు ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తారు. డిష్ కుమార్ (వంశీధర్ గౌడ్) ద్వారా వాళ్లకు తెలిసిన షాకింగ్ విషయం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ :
ఈ మధ్య కాలంలో సరైన కంటెంట్ తో తెరకెక్కితే బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సైతం మ్యాజిక్ చేస్తున్నాయి. శుభం సినిమా కూడా ఆ కోవలోకే చెందుతుంది. హర్రర్ కామెడీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కగా ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ కు సంబంధించి కథనం పరంగా కొన్ని పొరపాట్లు అయితే జరిగాయి. క్లైమాక్స్ విషయంలో కూడా దర్శకుడు కొంతమేర తడబడ్డారు.
సినిమాలో ప్రధాన నటీనటులంతా కొత్తవాళ్లే అయినా అందరూ అనుభవం ఉన్న వ్యక్తులలా నటించారు. తక్కువ నిడివితోనే తెరకెక్కడం ఈ సినిమాకు ప్లస్ అయింది. టెక్నికల్ అంశాలు చిన్న సినిమాలకు అనుగుణంగా ఉన్నాయి. మాయ పాత్రలో సమంత, చిన్న పాత్రలో గంగవ్వ ఆకట్టుకున్నారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకునిగా తన మార్క్ చాటుకుని ప్రేక్షకులను మెప్పించే విషయంలో సక్సెస్ అయ్యారు. ఈ వీకెండ్ కు ఒక మంచి సినిమాను చూడాలని భావించే వాళ్లకు శుభం బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
బలాలు : ప్రధాన నటీనటుల నటన, ఫస్టాఫ్, కామెడీ సీన్స్
బలహీనతలు : సెకండాఫ్, కొన్ని లాజిక్ లేని సీన్స్
రేటింగ్ : 3.0/5.0