ప్రముఖ బుల్లితెర నటుడు రాజేష్ పూజారి (34)  గుండెపోటుతో  మరణించారు.. తన స్నేహితుడు వివాహ వేడుకకు హాజరైన రాకేష్ మెహందీ ఫంక్షన్ లో ఉన్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయారట. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు సైతం దగ్గరలో ఉండే ఆసుపత్రికి తరలించగా నటుడు రాకేష్ అప్పటికే మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. ఆదివారం సాయంత్రం ఉడిపి జిల్లాలో జరిగిన మెహందీ వేడుకలలో ఈ విషాద సంఘటన చోటుచేసుకున్నదట. మెహందీ వేడుకలలో ఫోటోలు దిగుతూ ఇంస్టాగ్రామ్ ఖాతాలో కూడా ఫోటోలను షేర్ చేశారు.


ఆ తర్వాత తన చెల్లెలు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారని.. అలా చెప్పిన కొద్దిసేపటికి రాకేష్ పూజారి కన్నుమూశారు. తన స్నేహితుడి పెళ్లిలో మాట్లాడుతూ ఉండగా ఒక్క సారిగా కుప్పకూలిపోయారని.. తన మరణానికి కారణం గుండెపోటు అంటూ వైద్యులు తెలియజేశారట. కన్నడలో ప్రముఖ రియాలిటీ షోల వల్ల కామెడీ కిలాడీగలు వాటి షోల ద్వారా బాగానే పేరు సంపాదించారు రాకేష్.. ఈ షోలో విన్నర్ 3 గా కూడా గెలిచారు. ఆ తర్వాత 2014లో కడలే బాజిల్ అనే మరొక రియాలిటీ షోలో కూడా పాల్గొన్నారు.


ఆ క్రేజ్ తోనే ఉమిల్, రాకేష్ అమ్మెరే పోలీస్ , తుళు వంటి సినిమాలలో కూడా నటించే అవకాశం దక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం కాంతారా ఫ్రీక్వెల్ గా వస్తున్న చిత్రంలో కూడా నటిస్తున్నారట. ఇటీవలే తనకు  సంబంధించిన షూటింగ్  కూడా పూర్తి అయ్యిందట. కానీ ఇంతలోనే ఇలా గుండెపోటుతో మరణించడంతో అభిమానులు తీవ్ర  దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కాంతారా -2 చిత్రాన్ని ఈ ఏడాది రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వంలోని నటిస్తూ ఉన్నారు.  ఈ విషయం తెలిసి పలువురు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా రాకేష్ ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: