సమంత ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన సమంత తెలుగుతో పాటు హిందీలో కూడా సినిమాలలో నటిస్తోంది. బాలీవుడ్ లోనూ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా పేరు ప్రశంసలు అందుకుంటుంది. ఇదిలా ఉండగా.... రీసెంట్ గానే సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. శుభం సినిమాకు సమంత నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. 

సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. అందులో సమంత వచ్చి సందడి చేశారు. ఈ క్రమంలోనే ఇందులో సమంత తన అసిస్టెంట్ ను ఓదార్చుతున్న ఓ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. సక్సెస్ మీట్ లో సమంత అసిస్టెంట్ ఆర్యన్ పాల్గొన్నారు. అక్కడ ఆర్యన్ స్టేజీ మీద కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో సమంత తన వద్దకు వెళ్లి అతడికి హాగ్ ఇచ్చి ఓదార్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. 

దీనిపై కొంతమంది నెగటివ్ గా స్పందిస్తే.... మరి కొంత మంది పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మా సమంత బంగారం. ఎవరికైనా సరే అవకాశాలను ఇస్తుంది. ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే అసలు చూస్తూ ఉండలేదు తట్టుకోలేదు అని కామెంట్ చేస్తున్నారు. సమంత గొప్ప మనసును మెచ్చుకుంటున్నారు. 

ఇదిలా ఉండగా.... గత కొద్ది రోజుల నుంచి సమంత రాజు నిడుమోరుతో డేటింగ్ లో ఉన్నట్లు అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ తనలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలపై సమంత, రాజ్ నిడుమోరు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ఈ వార్తలపై ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తేనే అసలు విషయం బయటికి రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: