
దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూతురు ధృతి అమెరికాలో ఇటీవల డిగ్రీ పూర్తి చేసింది. తాజాగా తన ఫ్యామిలీతో కలిసి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న ఈమె ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు చూసిన పునీత్ రాజకుమార్ అభిమానులు మాత్రం కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ అభిమాన హీరో కూతురు అమెరికాలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటుంటే.. ఈ ఆనందాన్ని చూసి తరించిపోయే అదృష్టం మా హీరోకి లేదే అంటూ ఆయనను తలుచుకొని ఎమోషనల్ అవుతున్నారు.
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజకుమార్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. హీరో గానే కాకుండా గొప్ప సామాజిక వేత్తగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఎన్నో ఛారిటీ ట్రస్ట్ లను ఏర్పాటు చేసి వాటన్నింటికీ డబ్బును అందిస్తూ అండగా నిలిచారు. అలాంటి ఈయన గత కొంతకాలం క్రితం మరణించిన విషయం తెలిసిందే. ఇక ఆయన మరణాన్ని ఇప్పటికీ కూడా ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇక ధృతి కాలేజ్ విషయానికి వస్తే న్యూయార్క్ నగరంలోని ది న్యూ స్కూల్లో భాగమైన పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ 2022లో ఐదు సంవత్సరాల పాటు QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో యునైటెడ్ స్టేట్స్ లో నంబర్ వన్ డిజైన్స్ స్కూల్ గా గుర్తింపు పొందింది. 1896లో విలియం మెరిట్ చేజ్ స్థాపించిన ఈ పాఠశాల 1941లో ఫ్రాంక్ హల్వా పార్సన్స్ గా పేరు మార్చబడింది. ఇప్పుడు ఇందులోనే ధృతి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
ఇదిలా ఉండగా పునీత్ రాజకుమార్ కూతురు సినిమా కార్యక్రమాలలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ప్రస్తుతం రాజ్ కుమారు భార్య అశ్విని మాత్రం పి ఆర్ కె ప్రొడక్షన్, పి ఆర్ కె ఆడియో సంస్థలను చూసుకుంటున్నారు. ఏది ఏమైనా పునీత్ రాజకుమార్ కూతురు ఘనత ను ఆస్వాదించడానికి ఆయన లేకపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.