టాలీవుడ్ లో చైల్డ్ యాక్టర్ గా కమెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న మాస్టర్ భరత్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన కామెడీ టైమింగ్ తోనే ఎన్నో సినిమాలను మంచి విజయాలను అందుకున్నారు. ఒకప్పుడు మాస్టర్ భరత్ సినిమాల డేట్ ల కోసం చాలామంది దర్శక నిర్మాతలు వెయిట్ చేసేవారు..స్టార్ హీరోల చిత్రాలలో కూడా స్నేహితుడిగా నటించారు మాస్టర్ భరత్. అయితే తాజాగా నటుడు భరత్ ఇంట తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భరత్ తల్లి కమలాసిని అకాల మరణంతో మృతి చెందినట్లుగా వినిపిస్తున్నాయి. దీంతో నటుడు భరత్ ఇంట తీవ్రమైన విషాదం చోటు చేసుకున్నది.



అయితే ఈ విషయం తెలిసి అటు పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా భరత్ తల్లి కమలహాసిని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఈమె మరణం కూడా నటుడు భరత్ కు తీరని లోటు అని చెప్పవచ్చు.. నిన్నటి రోజున రాత్రి 8 గంటల సమయంలో నటుడు భరత్ తల్లి తుది శ్వాస విడిచినట్లుగా వినిపిస్తున్నాయి.. చెన్నైలో తన సొంత నివాసంలోనే ఈమె మరణించారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన నటుడు భరత్ కానీ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.


నటుడుగా వెంకీ, ఢి, బిందాస్, దూసుకెళ్తా, వంటి చిత్రాలతో పాటుగా 80 కి పైగా చిత్రాలలో నటించారు భరత్. ప్రస్తుతం సాగర్ డైరెక్షన్లో ఒక సినిమాలో కూడా నటిస్తూ ఉన్నారు. భరత్ మూడేళ్ల వయసు నుంచి నటిస్తూ ఉన్నారని ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు తన మెడిసిన్ చదువుని కూడా పూర్తి చేశానని తెలిపారు. తనకు తన తల్లి అంటే చాలా ఇష్టం అంటూ ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో మాస్టర్ భరత్ తెలియజేశారు. ఈ మధ్యకాలంలో సినిమాలలో కూడా పెద్దగా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: