
జూనియర్ ఎన్టీఆర్ ని కొంతమంది నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు దూరం పెడుతూ ఉంటారు . ఎంతలా అంటే తన సొంత ఇంట్లో ఫంక్షన్ జరిగిన .. పెళ్లిళ్లు జరిగిన జూనియర్ ఎన్టీఆర్ ని కళ్యాణ్ రామ్ ని పిలవకుండానే అన్ని పనులు కానిచ్చేసారు ఓ బడా ఫ్యామిలీ. ఆ విషయం అందరికీ తెలుసు . అయితే ఆ బడా ఫ్యామిలీని లైక్ చేసే జనాలు నందమూరి అన్న పదం కనపడితే పడి చచ్చిపోతూ ఉంటారు . ఆ కారణంగానే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు .
అసలు నందమూరి అనే ట్యాగ్ జూనియర్ ఎన్టీఆర్ పేరు ముందు లేకపోతే తారక్ పరిస్థితి ఏంటి? ఏమై ఉండేవాడు..? ఆయన పొజిషన్ ఏంటి..? ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చేవాడా..? లేకపోతే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేవాడా..? లేకపోతే తాను చదువుకున్న చదువుకు వేరే ఏదైనా ఉద్యోగం చేసుకునేవాడా ..? అసలు నందమూరి అనే ఇంటి పేరు ఆయనకు లేకపోతే తారక్ అందరికీ తెలిసుండే వాడా..? ఇంత పెద్ద స్టార్ అయి ఉండేవాడా..? అంటూ నందమూరి కుటుంబాన్ని లైక్ చేసే జనాలు జూనియర్ ఎన్టీఆర్ పై ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.
దానికి తగ్గట్టే తారక్ ఫాన్స్ కూడా ఆ కౌంటర్స్ కి తిప్పికొడుతున్నారు. ఇంటి పేరుతో సంబంధం లేదు. మనిషిలో టాలెంట్ ఉంటే ఎవరైనా స్టార్ గా ఎదగగలరు . మరీ ముఖ్యంగా నాని ఇండస్ట్రీలో ఇప్పుడు తోపైన హీరోగా ఉన్నాడు . 100 కోట్లు ఆయన సినిమాకు వస్తున్నాయి. నాని ఎవరు సపోర్ట్ చూసుకొని రాలేదు.. తన పేరు ముందు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇంటి పేరు లేదు . కానీ నాని సక్సెస్ అయ్యాడుగా . జూనియర్ ఎన్టీఆర్ కూడా అంతే నందమూరి అనేది కేవలం ట్యాగ్ మాత్రమే . ఆయన టాలెంట్ కి నందమూరి అనే ట్యాగ్ ఎటువంటి సంబంధం లేదు. ఇకనైనా తారక్ ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి . పుట్టినరోజు నాడు నెగిటివ్ కామెంట్స్ చేయకండి అంటూ కూసింత ఘాటుగానే కౌంటర్స్ వేస్తున్నారు తారక్ ఫ్యాన్స్ . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే ఇష్యూ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!