
మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులకు బెయిల్ రాగా ఆయనకు మాత్రం రాలేదు. అయితే నందిగం సురేష్ భార్య భవిష్యత్తులో హోమ్ మినిష్టర్ అవుతారని ఒక లాయర్ చెప్పారని ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఆ కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం అయితే చేయబోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మాజీ ఎంపీ నందిగం సురేష్ భార్యకు సీటు గురించి ఆశ కల్పించి ఆమె కుటుంబంలో వివాదాలు తలెత్తే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నందిగం సురేష్ బెయిల్ పై ఎప్పుడు విడుదలవుతారో తెలియాల్సి ఉంది. ఆయన భార్యకు సరదాగా చెప్పిన సమచారం మీడియాకు ఎలా తెలిసిందనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మాజీ ఎంపీ నందిగం సురేష్ పై ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ఆయన ఇప్పట్లో విడుదలయ్యే ఛాన్స్ అయితే లేదని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నందిగం సురేష్ కుటుంబ సభ్యులకు అనవసర ఆశలు కల్పించి ఆ కుటుంబ పొలిటికల్ కెరీర్ ను నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు