
అయితే ఈ సినిమాలో హీరో పాత్ర లంచం తీసుకుంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కథ నచ్చినా లంచం తీసుకోవడం నచ్చక బాలయ్య నెల రోజుల పాటు సైలెంట్ గా ఉన్నా అ తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమా మెజారిటీ సెంటర్లలో 50 రోజులు, 100 రోజులు ఆడింది. రీరిలీజ్ లో సైతం ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.
ఈ సినిమా రీరిలీజ్ వెర్షన్ లో ఒక సాంగ్ ను యాడ్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ సాంగ్ కు భీమ్స్ సంగీతం అందించగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. బాలయ్య లిప్ మూమెంట్ కు అనుగుణంగా సాంగ్, లిరిక్స్ కంపోజ్ చేయడం సాధారణమైన విషయం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
అఖండ సినిమా నుంచి బాలయ్య విజయ పరంపర మొదలైన సంగతి తెలిసిందే. బాలయ్యతో సినిమాలను తెరకెక్కించిన దర్శకులకు సైతం ఊహించని స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. ప్రేక్షకులు మెచ్చేలా బాలయ్యను చూపిస్తే సినిమా హిట్టని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య సినిమాల డిజిటల్ హక్కులకు సైతం ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొంది. వరుస సినిమాలతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తున్నారు. బాలయ్య నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.