యాంకర్ శివ జ్యోతి ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో ప్రసారమయ్యే  తీన్మార్ వార్తలు అనే ప్రోగ్రామ్ ద్వారా చాలా ఫేమస్ అయింది. ఇందులో సావిత్రి అనే పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో తీన్మార్ సావిత్రి గా పేరు తెచ్చుకుంది.అయితే అలాంటి యాంకర్ శివజ్యోతికి బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది.అలా ఎప్పుడైతే బిగ్ బాస్ కి వెళ్లిందో అప్పటినుండి శివ జ్యోతి క్రేజ్ మొత్తం మారిపోయింది. ఈ రియాల్టీ షోలో శివ జ్యోతి కప్పు గెలవక పోయినప్పటికీ తన ఎమోషన్స్ తో తన ఆటతో మాటలతో ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇక హౌస్ నుండి బయటికి వచ్చాక ఎన్నో ప్రమోషన్స్ చేస్తూ ఒక్కసారిగా తన రూపు రేఖలు మార్చేసుకుంది.ఒకప్పుడు లంగా వోని లేదా చీర కట్టుకొని ఎంతో సాంప్రదాయంగా కనిపించే శివ జ్యోతి ప్రస్తుతం పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

అయితే అలాంటి శివజ్యోతి తాజాగా భర్తను ఇంప్రెస్ చేస్తాను అంటూ తన  బాత్ రూమ్ వీడియో పెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. శివ జ్యోతి ఉదయం లేచినప్పటి నుండి బ్రష్ చేయడం స్నానం చేయడం, చీర కట్టుకోవడం, డాన్స్ చేయడం,తన భర్తని ఇంప్రెస్ చేయడం వంటివి చూపించారు. అయితే అంతా బాగానే ఉంది కానీ బాత్రూంలో స్నానం చేసే వీడియోను కూడా షేర్ చేసింది. షవర్ పట్టుకొని స్నానం చేయడం, కాళ్లు చేతులు రుద్దుకోవడం  వంటివి వీడియోలో చూపించడంతో ఈ వీడియో చూసి నెటిజన్లు నువ్వు భర్త ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావా.. లేక సోషల్ మీడియాలో నిన్ను చూసే వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావా.. ఫాలోవర్ల కోసం లైక్ ల కోసం ఎలాంటి పని అయినా చేస్తావా.. ఇంతకు దిగజారుతావా.. అంటూ మండిపడుతున్నారు. 

అయితే ఇదంతా శివ జ్యోతి ఓ బాడీ వాష్ ప్రమోషన్స్ లో భాగంగా డబ్బుల కోసమే ఈ వీడియో చేసింది. కానీ ఎంత డబ్బుల కోసం చేసినా కూడా శివ జ్యోతి పెట్టిన వీడియో మాత్రం చాలా మందికి నచ్చడం లేదు. దాంతో ఈ వీడియో పెట్టి శివ జ్యోతి సోషల్ మీడియా ట్రోలింగ్ కి గురవుతుంది.ఇక ఇప్పటికే శివ జ్యోతి డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంది అని ఓ ప్రచారం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాదు బిగ్ బాస్ నుండి వచ్చాక ఆమె కోట్ల ఆస్తులు సంపాదించిందని,ఇవన్నీ ఎక్కడినుండి వచ్చాయని, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే ఇన్ని కోట్లు సంపాదించిందనే రూమర్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ తాజాగా డబ్బుల కోసం మళ్ళీ బాడీ వాష్ ప్రమోషన్స్ చేసి విమర్శల పాలవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: