
ప్రతి ఒక్కరినోట అదే మాట .. గద్దర్ అవార్డ్స్ లో బన్ని కంటే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన సెలబ్రిటి..!

ఈ ఈవెంట్ కి అనేకమంది సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు . చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఈ ఈవెంట్లో మెరిసారు. సందడి చేశారు. నందమూరి బాలకృష్ణ .. దిల్ రాజు .. అల్లు అర్జున్ ..విజయ్ దేవరకొండ ..సీనియర్ హీరోయిన్స్ చాలా మంది ఈ వేదికపై మెరిశారు. కానీ అందరికన్నా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం ఓ స్పెషల్ బ్యూటీ . ఆమె మరెవరో కాదు హీరోయిన్ "ఫరీయా అబ్దుల్లా". అభిమానులు ముద్దుగా చిట్టి అంటూ పిల్చుకుంటారు.
చాలా చాలా స్పెషల్ గా ఫరీయా అబ్దుల్లా ఈ వేదికపై మెరిసింది. గద్దర్ అవార్డ్స్ వేడుకలు ఫరీయా అబ్దుల్లా బిహెవ్ చేసిన పద్ధతి ..ఆమెకి ఇంకా ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేలా చేసింది . ఈ గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ లో ఆమె స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుంది ఈ బ్యూటి. మత్తు వదల రా సినిమాలోని ర్యాప్ సాంగ్ కి స్పెషల్ జ్యూరి అవార్డు అందుకుంది . అయితే చాలామంది అవార్డు వచ్చాక హెడ్ వెయిట్ చూపిస్తూ ఉంటారు. ఓవర్ యాక్షన్స్ చేస్తూ ఉంటారు కానీ ఫరీయా అబ్దుల్లా మాత్రం డౌన్ టు ఎర్త్ అస్సలు ఈగో లేకుండా .. హెడ్ వెయిట్ లేకుండా చాలా సరదాగా అందరితో కలిసిపోయి మాట్లాడింది . దీంతో ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫరీయా అబ్దుల్లా గురించే మాట్లాడుకుంటున్నారు . ఆమె పేరుని హైలెట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు..!