బాలీవుడ్ లో భారీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం రామాయణ.. ఈ చిత్రం మొదలుపెట్టినప్పటి నుంచి భారీగానే అంచనాలు పెంచేస్తోంది.ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న గ్లింప్స్ ఇటీవలే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత అంచనాలను పెంచేసినట్టుగా కనిపిస్తోంది. రణబీర్ కపూర్ రాముడుగా.. సాయి పల్లవి సీతగా , యశ్ రావణాసురుడి పాత్రలో కనిపించారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ నికేష్ తివారి డైరెక్షన్ వహించారు. ఈ చిత్రంలో చాలామంది కొన్ని క్యారెక్టర్లలో స్టార్స్ సైతం నటిస్తూ ఉండడంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి భారీ హైప్ ఏర్పడింది.


అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి బడ్జెట్ విషయంలో కొంతవరకు చర్చలు జరుగుతున్నట్లు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.ఈ సినిమాని రెండు భాగాలుగా తీస్తున్నారని.. మొదటి పార్ట్ గా వస్తున్న రామాయణ చిత్రానికి సుమారుగా 900 కోట్ల రూపాయలు బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు బాలీవుడ్లో వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు చిత్ర బృందం. ఇక సెకండ్ పార్ట్  కోసం మరో పార్టీకి 700 కోట్ల రూపాయలు కేటాయించారని వినిపిస్తున్నాయి.


నార్త్, సౌత్ స్టార్లతో కలిసి తీస్తున్న సినిమా కావడంతో పాటుగా అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్లే ఉండడంతో ఈ సినిమా ఇండియాలోనే ఒక భారీ విజువల్ వండర్ చిత్రంగా రాబోతోందని ఈ చిత్రాన్ని మల్హోత్రా టీమ్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి భారీ తారాగణం మరొక కీలకమైన అంశంగా మారింది. సినిమా షూటింగ్ ఇప్పటికే రెగ్యులర్ గా జరుగుతోందని రామాయణం మీద ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చిన ప్రస్తుతం జనరేషన్ దృష్టిలో పెట్టుకొని మరి చిత్రాన్ని తీస్తున్నట్లుగా తెలియజేస్తోంది చిత్ర బృందం. మరి ఇండియా లోనే భారీ బడ్జెట్ తీస్తున్న ఈ సినిమా రికవరీ సాధ్యమయ్యేనా అన్నట్టుగా కూడా కొంతమంది నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హిస్టారికల్ సినిమా కాబట్టి రాబడుతుందనే విధంగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: