ఏ దేశమైన , రాష్ట్రమైనా , ప్రాంతం అయినా అభివృద్ధి చెందాలి అంటే దానికి ప్రధానంగా ఉండాల్సింది రోడ్డు మార్గం. రోడ్డు మార్గం సరిగ్గా ఉన్నట్లయితే ప్రాంతాలు అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి. కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే రోడ్డు మార్గాలు పట్టణాలకు ఎక్కువ శాతం బాగుండేవి , చిన్న చిన్న గ్రామాలకు రోడ్డు మార్గాలు అంతగా బాగుండేది కాదు. దానితో అనేక మంది జనాలు ఎంతో ఇబ్బందులు పడేవారు. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు దాదాపు అనేక గ్రామాలకు మంచి రోడ్డు సదుపాయాలు ఉన్నాయి.

చిన్న గ్రామాలకు రోడ్డు సదుపాయాలు ఉంటే ఆ గ్రామ ప్రజలకు ఎలా ప్రయోజనాలు జరుగుతాయో రాష్ట్రాలకు కూడా మంచి రోడ్లు , మరియు విశాలమైన రోడ్లు ఉన్నట్లయితే ఆ రాష్ట్రాలు కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతికి కూడా కేంద్రం భారీ స్థాయిలో రోడ్లను కేటాయించింది. ఇక భారత దేశంలోనే ఎక్కడా లేని పొడవైన రింగ్ రోడ్ ను అమరావతిలో నిర్మించడానికి కేంద్రం రెడీ అయ్యింది. భారతదేశం లోనే ఎక్కడా లేని పొడవైన రింగురోడ్ మరియు భారతదేశంలో ఎక్కడా లేని వెడల్పు కలిగిన  రోడ్డును అమరావతిలో నిర్మించడం కోసం కేంద్రం ముందడుగు వేసింది. భారతదేశం లోనే ఎక్కడా లేని 180 కిలో మీటర్ల మేర  పెద్ద ఇన్నర్ రింగ్ రోడ్డు ను కేంద్రం అమరావతికి సాంక్షన్ చేసింది.

ఇక ఈ రోడ్డు వెడల్పు వచ్చేసి దాదాపు 140 మీటర్లుగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇది భారతదేశం లోనే అత్యధిక వెడల్పు గల రోడ్డుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ రోడ్డు నిర్మించడానికి భూసేకరణ కోసం 5300 కోట్లు జాతీయ రహదారుల సంస్థకు కేంద్రం నుంచి వెళ్లాయి. ఈ డబ్బులతో కేంద్రం ఈ రోడ్డును నిర్మించడం కోసం కోసం భూసేకరణ చేయాలి అని సూచించినట్లు తెలుస్తోంది. దీనితో అమరావతిలో భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేని అత్యంత పొడవైన , అత్యంత వెడల్పైన రోడ్డు రానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: