సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్క స్టార్ సెలబ్రిటీ పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతూనే వస్తుంది.  మరీ ముఖ్యంగా ఏ స్టార్ హీరో నటించిన సినిమా రిలీజ్ అవుతున్న సరే ఆ స్టార్ హీరోకి సంబంధించి ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.  ఈ మధ్యకాలంలో అలాంటివి మనం ఎన్నెన్నో చూసాం. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక పాత తాలూకా రూమర్ మరొకసారి నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది . బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త గబ్బు లేపుతుంది.
 

మనకు తెలిసిందే ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్.  నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు.  మన ఇండస్ట్రీలో ఉండే పాన్ ఇండియా హీరోలలో టాప్ పోజీషన్ లో ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ . ప్రెసెంట్ ఆయన వార్ 2 సినిమాలో నటించాడు . ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు జూనియర్ ఎన్టీఆర్ . అంతేకాదు సినీ ప్రమోషన్స్ లో కూడా అలాగే పాల్గొంటున్నాడు . అయితే జూనియర్ ఎన్టీఆర్ అంటే పడని కొందరు బాలీవుడ్ స్టార్స్ ఆయన ఇండస్ట్రీలో నిలదొక్కుకోనికుండా చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఆయనకు సంబంధించిన ఒక పాత రూమర్ ని సోషల్ మీడియాలో కావాలనే వైరల్ చేస్తున్నారు.



గతంలో సమీరారెడ్డి - జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఏదో రిలేషన్షిప్ ఉంది అంటూ అప్పట్లో కొన్ని వార్తలు వినిపించాయి . అదంతా ఫేక్ అంటూ చాలా సందర్భాలలో సమీరారెడ్డి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కొట్టి పడేశారు. కానీ కావాలని ఎన్టీఆర్ ని ఇండస్ట్రీలో ఎదగనీకుండా కొంతమంది పదేపదే ఆ వార్తలను మళ్లీ మళ్లీ వైరల్ చేస్తున్నారు.  ఎన్టీఆర్ కి సంబంధించిన వార్ 2 సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవ్వబోతుంది అన్న మూమెంట్లో మరొకసారి సమీరారెడ్డి - ఎన్టీఆర్ ల మధ్య ఉన్న రిలేషన్షిప్ ఇదే  అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు . ఎన్టీఆర్ ఇమేజ్ ని డామేజ్ చేయడానికి ఇలా కొందరు బాలీవుడ్ స్టార్స్ పనికట్టుకుని మరి ఆయనని ట్రోల్ చేయిస్తున్నారు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . అంతేకాదు హద్దులు మీరితే ఎవరైనా సరే తాటతీస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: