- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన పవర్‌ను ప్రూవ్ చేశారు. ప‌వ‌న్‌ నటిస్తున్న భారీ యాక్షన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా "దే కాల్ హిమ్ OG" నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ "ఫైర్‌స్టారమ్" ప్రస్తుతం యూట్యూబ్‌లో సెన్సేషన్‌గా మారింది. ఈ పాట విడుదలైన నిమిషాల వ్యవధిలోనే ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. థ‌మ‌న్ కంపోజ్ చేసిన ఈ పవర్‌ఫుల్ ట్రాక్‌కి అభిమానులు ఫిదా అయిపోయారు. తక్కువ టైంలోనే యూట్యూబ్‌ రికార్డులు బద్దలయ్యాయి. నిన్న మ‌ధ్యాహ్నం రిలీజ్ అయిన ఈ సాంగ్ ఒక్క రోజులోనే 6.2 మిలియన్ వ్యూస్, 8.30. ల‌క్ష‌ల‌ లైక్స్ రాబట్టి, గతంలో మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో క‌ళావ‌తి సాంగ్ చేసిన రికార్డును బద్దలు కొట్టింది. క‌ళావతి పాటకు మూడు సంవత్సరాలుగా అత్యధిక లైక్స్‌గా ఉన్న రికార్డు 806 వేలుగా ఉండగా, ఇప్పుడు ఫైర్‌స్టారమ్ ఆ రికార్డును అధిగమించింది. ఈ రెండు పాటలకూ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ కావడం విశేషం. ఇది థ‌మ‌న్‌ కెరీర్‌లో మరో మైలురాయిగా చెప్పుకోవచ్చు.


"దే కాల్ హిమ్ OG" సినిమా సుజీత్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఓజీ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ ఒక స్టైలిష్ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకుల్లోనే ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హాష్మీ, విలక్షణ నటులు ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శామ్, శ్రియా రెడ్డి వంటి ప్రముఖులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


పవన్ కళ్యాణ్ లుక్, యాక్షన్ మోడ్, పాటల విజువల్స్ అన్నీ అభిమానుల్లో గూస్‌బంప్స్ కలిగించేలా ఉన్నాయి. ఫైర్‌స్టారమ్ వీడియోలో పవన్ కళ్యాణ్ స్టైల్, మాస్ మేనరిజంలు, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఊపేస్తున్నాయి. పాటకు థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకే వెన్నుముక‌గా మారేలా ఉంది. సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రచార దశలోనే సెన్సేషనల్ రికార్డులు సృష్టిస్తోంది. మ‌రి రేపు థియేటర్ల‌లో ఓజీ సెన్షేష‌న‌ల్ రికార్డులు క్రియేట్ చేయ‌డం ఖాయం.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: