
ఈ సినిమా చూసేందుకు బాలీవుడ్ - టాలీవుడ్ -కోలీవుడ్ జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ ఫ్యాన్స్ తమ హీరో గొప్ప అంటే టాలీవుడ్ లో త జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా హీరో గొప్ప అంటూ ఇద్దరికీ సపోర్ట్ చేస్తున్నారు . కాగా రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వార్ 2 మూవీ టీం సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది . ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ నడుమ తెరకెక్కే యాక్షన్ సీక్వెన్స్ ల కనిపిస్తున్న ఈ ఐమ్యాక్స్ పోస్టర్ మంచి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తుంది .
దీనితో ఫ్యాన్స్ ఫుల్ సంబరపడిపోతున్నారు . ఈ సినిమాని ఐమ్యాక్స్ వర్షెన్ లో చూసేందుకు మరింత ఎక్సైట్ అవుతున్నారు . ఇక ఈ చిత్రంలో కీయర అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది . అయితే హృతిక్ రోషన్ సరసన ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది కియరా అద్వాని. ఎన్టీఆర్ కి ఈ సినిమాలో హీరోయిన్ లేదు. నిజానికి ఇదే సినిమాకి బిగ్ హైలెట్ కాబోతుంది అంటున్నారు మేకర్స్. యాష్ రాజ్ ఫిలిమ్స్ తమ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించిన ప్రాజెక్టు ఆగస్టు 14న తెలుగు - తమిళ్ - హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు మూవీ మేకర్స్. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో..??