ఈ సంవత్సరం ఆగస్టు 14 వ తేదీన ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు కలిగిన సినిమాలు అయినటువంటి వార్ 2 , కూలీ మూవీలు విడుదల కానున్నాయి. వార్ 2 మూవీ లో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ , బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించగా ... కూలీ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రజనీ కాంత్ హీరో గా నటించాడు. ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున విలన్ పాత్రలో కనిపించనుండగా ... బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ఆమీర్ ఖాన్ ఈ మూవీలో చిన్న క్యామియో పాత్రలో కనిపించనున్నాడు.

ఇలా ఈ రెండు మూవీలలో కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీ నటులు ఉండడం వల్ల ఈ రెండు మూవీలపై కూడా దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. అలా భారీ అంచనాలు కలిగిన ఈ రెండు సినిమాలు ఒకే తేదీన విడుదల కానున్నాయి. దానితో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లను సాధిస్తుంది , ఏ మూవీ మంచి విజయం సాధిస్తుంది , అనే ఆసక్తి సినిమా లవర్స్ లో బాగా పెరిగిపోయింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన యుఎస్ఏ ప్రీమియర్ ప్రీ సేల్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది.

దానితో ఆరు రోజుల ముందే ఈ రెండు మూవీలకు భారీ ఎత్తున యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ ద్వారా పెద్ద ఎత్తున కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆరు రోజుల ముందు వరకు యూఎస్ఏ ప్రీ సేల్స్ ద్వారా కూలీ సినిమాకు 297 కే కలెక్షన్లు దక్కగా , వార్ 2 మూవీ కి 216 కే కలెక్షన్స్ దక్కాయి. ఇలా ఈ రెండు మూవీలు కూడా యూఎస్ఏ లో ప్రీమియర్స్ ద్వారానే పెద్ద మొత్తంలో కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మరి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లను వసూలు చేస్తుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: