టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన తమన్నా ఈ మధ్యకాలంలో సినిమాలలో కంటే ఎక్కువగా స్పెషల్ సాంగులోనే నటిస్తూ బాగానే పేరు సంపాదించింది. సాధారణంగా హీరోయిన్స్ ఫెడౌట్ అవుతున్న సమయంలో స్పెషల్ సాంగ్ కనిపిస్తూ ఉంటారు హీరోయిన్స్. అయితే అలాంటి వాటన్నిటికీ తమన్నా చెక్ పెట్టింది. ఒకవైపు ఐటెం సాంగ్స్ లో నటిస్తూనే, హీరోయిన్గా కూడా పలు చిత్రాలలో నటిస్తూ తనని తాను ప్రూఫ్ చేసుకుంటోంది తమన్నా. ఇప్పటివరకు ఏ స్టార్ హీరోయిన్ చేయనన్ని స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది. దీంతో తమన్నా స్పెషల్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.




స్పెషల్ సాంగ్లతో సిల్వర్ స్క్రీన్ పైన మెస్మరైజ్ చేస్తున్న తమన్నా మొదటిసారి డిజిటల్ స్క్రీన్ పైన కూడా తన గ్లామర్ ట్రిటుతో అదరగొట్టేందుకు సిద్ధమయ్యింది. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్గా చేసిన ఈ సిరీస్ కోసం.. షారుక్ ఖాన్, తమన్నా కోసం స్పెషల్ సాంగ్ ఉండేలా చూసినట్టుగా బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రేపటి రోజున నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్ కాబోతున్న ఈ సిరీస్లో తమన్నా మరింత బోల్డ్ గా కనిపించబోతోందట.

ఇలా తమన్నా ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు స్పెషల్ సాంగ్ లలో అవకాశాలు వస్తే వదులుకోవడం లేదు. ఒక్కో చిత్రానికి రూ.4నుంచి రూ.5కోట్ల రూపాయలు అందుకుంటున్న తమన్నా స్పెషల్ సాంగులకు కోటి నుంచి రూ .2కోట్ల రూపాయల వరకు అందుకుంటోంది. దీన్ని బట్టి చూస్తే తమన్నా ఒక్క సినిమాతో అందుకొనే రెమ్యూనరేషన్ కేవలం రెండు స్పెషల్ సాంగ్లు చేస్తే వచ్చేస్తున్నాయి..అందుకే వీటి మీద తమన్నా ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమన్నా అవకాశాలు వచ్చేలా చేస్తోంది కూడా ఈ స్పెషల్ సాంగ్లే అన్నట్లుగా వినిపిస్తున్నాయి. స్త్రీ 2, రైడ్ 2 లో స్పెషల్ సాంగ్లో ఆకట్టుకున్న తమన్నా బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలను అందుకునేలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: