
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది లోనే రెండో రిలీజ్ గా వస్తున్నా సినిమా ఓజీ. కొద్ది రోజుల ముందే పవన్ హరిహర వీర మల్లు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆ సినిమా అంచనాలు అందుకోలేదు. ఇప్పుడు కొద్ది రోజుల గ్యాప్ లోనే మరోసారి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఓజీ సినిమా పై అంచనాలు అయితే మామూలుగా లేవు. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఓజీ సినిమాని దర్శకుడు సుజీత్ తెరకెక్కించ గా ఈ నెల 25న ఓజీ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.
ఓజీ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఇప్పుడు అంతకంతకూ హైప్ పెంచేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో మేకర్స్ నుంచి ఓ క్లారిటీ వచ్చేసింది. నిన్న సాంగ్ లో చూపించిన మిలట్రీ యాక్షన్ షాట్స్ . . అలాగే చిరుతపులి షాట్స్ కూడా లేవని క్లారిటీ ఇచ్చేశారు. ఇలా ఓజీ విషయంలో ఫ్యాన్స్ అనవసర అంచనాలు పెట్టుకుంటే మళ్లీ డిజప్పాయింట్ అవ్వక తప్పదు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా కు సుజిత్ దర్శకత్వం వహించారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాల ను మా దృష్టికి తీసుకు రావాలను కుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరు కు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు