
నిధి స్పెషల్ డేను సెలబ్రేట్ చేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ద్వారా నిధికి విషెస్ చెప్తూ, రాబోయే సినిమా హారర్ థ్రిల్ ని ముందుగానే టోన్ సెట్ చేశారు. ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కనుంది. టాప్ టెక్నికల్ స్టాండర్డ్స్, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఆడియన్స్ కి విజువల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్ గా ఇంటెన్స్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వబోతోంది. ప్రొడ్యూసర్ పుప్పాల అప్పల రాజు మాట్లాడుతూ.. నిధి అగర్వాల్ తన క్యారెక్టర్ కి అద్భుతమైన చార్మ్ తీసుకోస్తున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్ లో ఓ మైలురాయి అవుతుంది. మా ప్రొడక్షన్ హౌస్ లో ఆమె జాయిన్ అవ్వడం మాకు ఆనందం కలిగిస్తోంది. ఆమె బిగ్ స్క్రీన్ పై చూపించబోయే మేజిక్ కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో రాబోతున్నాయి. టైటిల్ దసరా సందర్భం గా రివీల్ చేస్తారు.