బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పని లేదు..RRR చిత్రం ద్వారా మంచి పాపులారిటీ అందుకుంది. ఆలియా భట్ భర్త రణబీర్ కపూర్ కూడా బాలీవుడ్లో స్టార్ హీరో. వీరిద్దరికి రాహా అనే ఒక కూతురు కూడా ఉన్నది. అయితే ఈ జంట ముంబైలో తమ కొత్త బంగ్లాలోకి త్వరలోనే మారాలనుకున్నారు. ఈ బంగ్లా రణబీర్ కపూర్ తాత రాజ్ కపూర్ ప్రాపర్టీ లో నిర్మించుకున్నారు. ఈ బంగ్లా 6 అంతస్తుల భవనానికి కృష్ణ రాజ్ అనే పేరు కూడా పెట్టారు.



దాదాపుగా ఈ బంగ్లా నిర్మాణం పూర్తి అయ్యింది. త్వరలోనే రణబీర్ కపూర్ రాహాతో కలిసి అలియా భట్ గృహప్రవేశం చేయాలనుకున్నారు. కానీ ఇల్లు నిర్మాణంలో ఉన్న సమయంలో కొంతమంది కొన్ని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ వీడియోల పైన ఆలియా భట్ తీవ్రంగా ఫైర్ అవుతోంది. తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఆలియా భట్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించినట్లు తెలుస్తోంది. ఇది తమ గోప్యత ను ఉల్లంఘించడమే అంటూ ఆమె తెలియజేసింది.

ముంబై లాంటి ప్రధాన నగరాలలో స్థలం తక్కువగా ఉంటుందని నాకు తెలుసు..కొన్నిసార్లు మన కిటికీ నుంచి చూస్తే పక్కవారి ఇల్లులు కూడా కనిపిస్తాయి. కానీ దానివల్ల ఇతరుల ప్రైవేటు ప్రాపర్టీ అయిన ఇళ్లను చిత్రీకరించడం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టే హక్కు ఎవరికీ లేదు అంటూ ఫైర్ అయ్యింది. అసలు నిర్మాణంలో ఉన్న మా ఇంటి వీడియోలను మాకు తెలియకుండా మా అనుమతి లేకుండానే ఎలా సోషల్ మీడియాలో రికార్డు చేసి ప్రచారం చేశాయంటూ ఒక నోట్ రాసుకోచ్చింది. అలియా భట్ ఈ విషయం పైన ఘాటుగానే స్పందించడంతో సెలబ్రిటీల గోప్యత పైన ఇప్పుడు మరొకసారి చర్చ మొదలైనట్లుగా బాలీవుడ్లో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: