కోలీవుడ్ హీరో జయం రవి ఇటీవల సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్‌కు గురవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమలో ఆయనకు ఉన్న క్రేజ్, పేరు ప్రఖ్యాతులు ప్రత్యేకం. మంచి నటనతో పాటు తన వ్యక్తిత్వం, ప్రవర్తన, విలువలతో కూడా అభిమానులను ఆకట్టుకున్నారు. “జయం రవి అంటే మంచి మనసున్న వ్యక్తి, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే భర్త, బాధ్యత గల వ్యక్తి” అనే అభిప్రాయం ప్రేక్షకులలో బలంగా ఉండేది. అయితే ఇటీవల ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన వార్తలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తన భార్య ఆర్తికి విడాకులు ఇచ్చి, ప్రఖ్యాత సింగర్ కెనిషా తో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో కూడా జయం రవి, కెనిషా తో దిగిన కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ రూమర్లకు మరింత బలం చేకూర్చాయి.


జనం ఊహాగానాలు పెంచుతుంటే, జయం రవి ఈ విషయంపై ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు. “మా వ్యక్తిగత జీవితం మా సొంతం. అందరికీ వివరించాల్సిన అవసరం లేదు” అంటూ, ఈ చర్చలన్నింటిని పక్కన పెట్టారు. రీసెంట్‌గా జయం రవి, కెనిషా  ఇద్దరూ కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో మరోసారి పెద్ద కలకలం రేగింది. ఈ పరిణామాల మధ్య జయం రవి భార్య ఆర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ అందరినీ కదిలించింది.

 

“నువ్వు నన్ను మోసం చేయగలవు… ఇతరులను కూడా మోసం చేయగలవు… కానీ దేవుడిని మాత్రం ఎప్పటికీ మోసం చేయలేవు.” అంటూ ఆర్తి పోస్ట్ లో రాసుకొచ్చింది. ఈ విషయం మరింతగా చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో చాలా మంది మహిళలు ఆర్తికి మద్దతుగా నిలుస్తూ సోషల్ మీడియాలో జయం రవిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. “ఈ మగవాళ్లు ఎందుకు ఇలా చేస్తారు? ఒక ఆడదాని దగ్గర లేనిది ఇంకో ఆడదాని దగ్గర ఏముంటుంది? ఎందుకింతగా ఒక అమ్మాయిని బాధపెట్టి మరో అమ్మాయిని సంతోషపెట్టాలనుకుంటారు? ఇదేం న్యాయం?” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.



జనం నుంచి వస్తున్న ఈ వ్యతిరేక స్పందన, విమర్శలు జయం రవి ఇమేజ్, కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు కుటుంబముఖుడిగా, గౌరవనీయుడిగా పేరుగాంచిన జయం రవి, ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడటంతో తన స్టార్ ఇమేజ్ దెబ్బతింటుందన్నది వారి అభిప్రాయం. ప్రస్తుతం జయం రవి ఈ ట్రోలింగ్, విమర్శల పట్ల పూర్తిగా స్పందించకుండా తన పనుల్లోనే బిజీగా ఉంటున్నారు. ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి..??

మరింత సమాచారం తెలుసుకోండి: