
మొత్తం రన్ టైం 169 నిమిషాల పాటు ఉండనుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే.. బోరింగ్ మూమెంట్స్ లేకుండా ఉంటే 160 నిమిషాల సినిమాను ప్రేక్షకులు కంప్లైంట్స్ లేకుండా ఎంజాయ్ చేస్తారు. సినిమాకు ఏ మాత్రం నెగటివ్ టాక్ ఉన్నా ఇన్ని నిమిషాల పాటు థియేటర్లలో సినిమా చూడాలంటే ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.
ఇక సినిమాలో మరో హైలైట్ మంచు మనోజ్. చాలా గ్యాప్ తర్వాత ఆయన విలన్ పాత్రలో కనిపించబోతుండటం సినీ ప్రేమికుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. టీజర్‌లోనే ఆయన లుక్, డైలాగ్స్ ప్రభావం చూపించాయి. తేజ సజ్జా - మనోజ్ మధ్య క్లాష్ సినిమా మొత్తాన్ని మజాగా మలుస్తుందని ట్రేడ్ టాక్. హీరోయిన్‌గా రితికా నాయక్ నటిస్తుండగా, ఆమె పాత్ర కూడా కథకు కీలకంగా ఉంటుందట.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు