మాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ తెలుగులో  బిమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష, వంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకుంది. టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్గా పేరు సంపాదించిన ఈ మలయాళం ముద్దుగుమ్మ.. తన అందం అభినయంతో  అందరిని ఆకట్టుకుంది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. చివరిగా 2023లో హీరోయిన్గా నటించిన చిత్రం డెవిల్ సినిమా  పర్వాలేదు అనిపించుకుంది. ఇప్పటివరకు సుమారుగా ఏడాదికి పైగా కావోస్తు ఉన్న తన నుంచి ఎలాంటి సినిమా విడుదల కాకపోవడంతో అభిమానులు నిరాశతో ఉన్నారు.


ముఖ్యంగా సంయుక్త కమిట్ అయిన చిత్రాలు పూర్తి కాకపోవడం వల్లే ఊహించని గ్యాప్ వచ్చిందని ఈ గ్యాప్ ఫిలప్ చేసేందుకే ఒక భారీ స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అఖండ 2 సినిమాలో కూడా నటిస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదల కావాల్సి ఉండగా డిసెంబర్ కి పోస్ట్ పోన్ అయినట్లుగా వినిపిస్తున్నాయి. అలాగే రొమాంటిక్ ఫిలిం అయినా నారి నారి నడుమ మురారి సినిమాను కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. అలాగే స్వయంభు సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నారు.


ఇవే కాకుండా మరో రెండు మూడు చిత్రాలలో కూడా నటిస్తోంది సంయుక్త మీనన్.  బాలీవుడ్ లో కూడా మరొక సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది. ఇలా తన సినిమాలను వచ్చే ఏడాది వరుసగా విడుదల చేసేలా నాలుగైదు సినిమాలను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే సంయుక్త మీనన్ కమ్ బ్యాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలని సెలెక్టివ్ చేసుకొని పలు సినిమాలలో నటిస్తోంది సంయుక్త. మరి ఈసారి ఎలాంటి విజయాలను అందుకొని అభిమానులను మెప్పిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: