- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

సినిమాటోగ్రాఫర్‌గా మొదలుపెట్టి దర్శకుడిగా ఎదిగిన కార్తీక్ ఘట్టమనేని ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఇటీవలే విడుదలైన ‘మిరాయ్’ సినిమాతో ఆయన ఘనవిజయం సాధించారు. ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌గా చేసిన ఈ సినిమా మంచి బ్లాక్‌బస్టర్ కావడంతో ఇండస్ట్రీలో కార్తీక్ ప్రతిభపై ప్రత్యేక దృష్టి పడింది. అయితే ఆయన కెరీర్ జర్నీ చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 2013లో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా మొదలుపెట్టి, ఆ తర్వాత కార్తికేయ, ఎక్స్‌ప్రెస్ రాజా, ప్రేమమ్, నిన్నుకోరి, రాధ సినిమాల‌కు అద్భుతమైన విజువల్స్ అందించారు. మధ్య మధ్యలో డైరెక్షన్‌పై ప్యాషన్‌ను కొనసాగిస్తూ, సినిమాటోగ్రఫీని కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నారు.


ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ ఒక పెద్ద అప్‌డేట్ వెల్లడించారు. ఆయన మెగాస్టార్ చిరంజీవి - బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చే భారీ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేయబోతున్నారు. గతంలో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో వస్తున్న సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాబీ ఈ కథను ప్రత్యేకంగా డిజైన్ చేశారని, ముఖ్యంగా కుటుంబ భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. చిరంజీవిని కొత్త కోణంలో చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ స్క్రిప్ట్ రాశారట. ఆ విజన్‌ను తెరపై నిజం చేయడంలో కార్తీక్ ఘట్టమనేని కెమెరా వర్క్ కీలకంగా మారనుంది.


ఇప్పటికే తన సినిమాటోగ్రఫీతో మ్యాజిక్ సృష్టించిన ఆయన, ఇప్పుడు మెగాస్టార్ సినిమాకు ప్రత్యేకమైన విజువల్ టచ్ ఇవ్వడం ఖాయం. మొత్తం మీద, ‘మిరాయ్’ బ్లాక్‌బస్టర్ విజయంతో దర్శకుడిగా తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్న కార్తీక్, మళ్లీ సినిమాటోగ్రాఫర్‌గా మెగాస్టార్ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆయన కెరీర్‌కు మరో మైలురాయి అవుతుందనే చెప్పాలి. ఈ సినిమా కోసం చిరు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: