
ధనుష్ ఎమోషనల్‌గా, “నాకు చిన్నప్పుడు ప్రతిరోజూ ఇడ్లీ తినాలనిపించేది … కానీ ఆ కోరిక తీరేది కాదు. ఇప్పుడు స్టార్ హోటల్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నా రుచి తెలియదు. ఈ సినిమా వెనక ఉన్న అసలు భావోద్వేగం అదే” అని అన్నాడు. అయితే యాంటీ ఫ్యాన్స్‌కి ఈ మాటలు నచ్చలేదు. వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. “పేదరికం స్టోరీలు చెప్పడం అతడి అలవాటు”, “సింపతీ కోసం డ్రామా” అంటూ అటాక్ చేశారు. ధనుష్‌కి ఎప్పటిలాగే మళ్లీ బలమైన నెగటివ్ వేవ్ వచ్చింది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే – గతంలో సీనియర్ రచయిత, దర్శకుడు విస్సు చెప్పిన ఒక నిజం. ఆయన మాటల్లో – “కార్తీక్ రాజా (ధనుష్ తండ్రి) చాలా కాలం నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అప్పుడు వారి ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు. వారానికి ఒకసారి ఆయన పిల్లలు (ధనుష్ సహా) మా ఇంటికి వచ్చి టీవీ చూసేవారు” అని చెప్పారు.
అంటే ధనుష్ చెబుతున్న కథల్లో అబద్ధం ఏమీ లేదని అర్థమవుతోంది. నిజంగా వాళ్ల కుటుంబం కష్టాలు చూసింది. అయితే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎవరైనా పెద్ద స్టార్స్ మీద సింపతీ హంటింగ్ అంటగట్టడం అలవాటైపోయింది. ధనుష్ ఫ్యాన్స్ మాత్రం గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు – “సినిమా ఇండస్ట్రీలో ఎవరికి వెండి చెంచాతో భోజనం పెట్టలేదు. అందరూ కష్టపడ్డారే. ధనుష్ లాంటి వాడి స్ట్రగుల్ ని తప్పుగా చూపించడం మానేయాలి. టాలెంట్ తో నేటి స్టార్ అయ్యాడు… అంతే కాని డ్రామా కాదు!” మొత్తానికి, ధనుష్ మళ్లీ తన చిన్ననాటి ఇడ్లీ ఎమోషన్ తో ట్రెండింగ్ లోకి వచ్చాడు. యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేసినా, ఫ్యాన్స్ మాత్రం మాస్ లెవెల్ లో బలమైన సపోర్ట్ ఇస్తున్నారు. ఇడ్లీ నుంచి ఇంటర్నేషనల్ స్టార్ వరకూ జర్నీ చేసిన హీరో – అదే ధనుష్!