టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో సిద్ధూ జొన్నలగడ్డ ఒకరు. ఈయన నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా కాలమే అవుతుంది. కెరియర్ ప్రారంభంలో ఈయన నటించిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అలాంటి సమయం లోనే ఈయన డీజే టిల్లు అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో సిద్దు కి సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈయన డీజే టిల్లు మూవీ కి కొనసాగింపు గారు పొందిన టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరో గా నటించాడు.

మంచి అంచనాల నడమావి విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. టిల్లు స్క్వేర్ లాంటి భారీ విజయం తర్వాత ఈయన జాక్ అనే స్పైయాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం భారీ ఆపజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సిద్దు "తెలుసు కదా" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంట్ అండ్ నటి మణులు అయినటువంటి రాశి కన్నా , నేహా శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

జాక్ లాంటి భారీ అపజయం తర్వాత సిద్దు నటిస్తున్న సినిమా అయినప్పటికి తెలుసు కదా మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఓ టీ టీ డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు ఏకంగా 22 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: