తాజాగా తేజ సజ్జ "మీరాయ్" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతుంది. ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ మూవీ విడుదల అయిన కొంత కాలానికే పవన్ కళ్యాణ్ నటించిన ఓజి సినిమా విడుదల కానుండడంతో ఓజి మూవీ కి గనుక మంచి టాక్ వచ్చినట్లయితే మీరాయ్ సినిమా కలెక్షన్లు పడిపోతాయి అని చాలా మంది అనుకున్నారు. ఇక ఇప్పటికే ఓజి సినిమా విడుదల అయ్యింది. ఓజి సినిమాకి మంచి టాక్ కూడా వచ్చింది. కానీ మీరాయ్ మూవీ కి మాత్రం మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు మీరాయ్ సినిమాకు సంబంధించిన 16 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 16 రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

16 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 23.20 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 6 కోట్లు , ఉత్తరాంధ్ర లో 4.86 కోట్లు , ఈస్ట్ లో 2.70 కోట్లు , వెస్ట్ లో 1.71 కోట్లు , గుంటూరు లో 2.22 కోట్లు , కృష్ణ లో 2.54 కోట్లు , నెల్లూరు లో 1.30 కోట్లు , కర్ణాటక లో 4.85 కోట్లు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9.25 కోట్లు , ఓవర్ సిస్  లో 15.90 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 16 రోజుల్లో 74.53 కోట్ల షేర్ ... 135.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 37 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఇప్పటివరకు ఈ సినిమాకు 37.53 కోట్ల లాభాలు వచ్చాయి. దానితో ఇప్పటికే ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: