కొంత కాలం క్రితం కాంతారా అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. రిషబ్ శెట్టి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. అలాగే ఈ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మొదట కన్నడ భాషలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో విడుదల చేశారు. అందులో భాగంగా తెలుగు లో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా కాంతారా చాప్టర్ 1 అనే టైటిల్ తో ఓ మూవీ ని రూపొందించారు.

ఈ సినిమాలో రిషబ్ శెట్టి హీరో గా నటించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 2 వ తేదీన అనేక భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాని తెలుగు లో కూడా పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేసింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేయడంతో ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది అని కూడా చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ కి సంబంధించిన తెలుగు సాటిలైట్ హక్కులను ప్రముఖ సాటిలైట్ సంస్థలలో ఒకటి అయినటువంటి జీ తెలుగు సంస్థ దక్కించుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: