
ఇదంతా జరిగిన సందర్భం ఏమిటంటే—పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ "ఓజి" గురించే. ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై ఐదు రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఐదు రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి పాత రికార్డులన్నిటినీ దాటేసింది. ఈ విజయోత్సాహంలో భాగంగా హైదరాబాద్ ప్రసాద్ స్లాబ్స్‌లో ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. ఆ ప్రత్యేక స్క్రీనింగ్‌కి మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్, నిర్మాత దానయ్య, సినిమాటోగ్రాఫర్ రవి, ఇంకా మరికొందరు హాజరయ్యారు. సినిమా చూస్తున్నప్పుడు వారందరూ ఒకరితో ఒకరు సరదాగా చిట్‌చాట్ చేస్తూ ఎంజాయ్ చేశారు. వారి ముఖాల్లో కనిపించిన సంతోషమే అభిమానులకు హైలైట్ అయింది.
ఈ సందర్భంగా స్క్రీన్ పై చూపిన ఒక క్లిప్ నుంచి స్పెషల్ మూమెంట్‌గా ఆ పిక్ క్లిక్ అయి ఇప్పుడు వైరల్ అవుతోంది. అభిమానులు ఈ పిక్ చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే కొందరు నెటిజన్లు, “ఈ ఫోటోలో హీరోయిన్ ప్రియాంక కూడా ఉంటే బాగుండేది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం, “అందరూ ఉన్నారు, కానీ ఒకే ఒక లోటు ఉంది—అది అకీరా. ఆయన కూడా ఉంటే ఈ ఫోటోకి పూర్తి అందం వచ్చేది” అని చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఫోటో సోషల్ మీడియాలో మాసివ్ హంగామా చేస్తూ, అభిమానుల హృదయాలను తాకుతూ, ఒక స్పెషల్ క్రేజీ మూమెంట్‌గా నిలిచిపోయింది.