సందీప్ రెడ్డి వంగా అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆయన చేసే సినిమాల స్టైల్, ఆయన చూపించే ధైర్యమైన విజన్. సాధారణంగా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు ఒకే రకమైన సేఫ్ జోన్‌కి పరిమితమవుతుంటారు. కానీ సందీప్ రెడ్డి మాత్రం అలా కాదు. ఆయనలో ఒక ప్రత్యేకత ఉంటుంది — అంటే పాత్రలు, కథలు, ఎమోషన్స్‌ని ఆయన చూసే విధానం చాలా వేరుగా ఉంటుంది. అందుకే ఆయనను చూసి “ఇతను కూడా ఒక డైరెక్టర్‌నే” అనడం చాలా సాధారణంగా అనిపిస్తుంది కానీ, నిజానికి ఆయన ఆలోచనలు, ప్రెజెంటేషన్ మిగతావారికి మించి ఉంటాయి.

అందుకే ఒక అర్జున్ రెడ్డి, ఒక అనిమల్ వంటి సినిమాలు ఆయన చేతుల మీదుగా వచ్చిన తర్వాత ఆయన టాలెంట్‌పై ఎవరూ సందేహం పెట్టుకోలేరు. కాస్త విభిన్నంగా ఆలోచించే, కొత్తదనం చూపించే, సెన్సేషనల్‌గా ఆడియన్స్ మైండ్‌లోకి వెళ్లిపోయే డైరెక్టర్ ఆయన. ఇండస్ట్రీలో ఎవరు ఏమనుకున్నా ఆయనకి పెద్దగా పర్వాలేదు. సమాజం ఆయన గురించి ఏం మాట్లాడినా, ఏం రాసినా కూడా ఆయన పట్టించుకునే వ్యక్తి కాదు. “నేను ఏమిటి? నేను డైరెక్టర్గా ఏం చూపించాలి అనుకుంటున్నానో అదే చూపిస్తాను. మిగతావన్నీ నాకు పెద్దగా ముఖ్యం కావు” అనే ధీమాతో, డెడికేషన్‌తో ఆయన తన సినిమాలను తీర్చిదిద్దుతుంటారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్‌తో కలిసి చేస్తున్న స్పిరిట్ ప్రాజెక్ట్‌పై అద్భుతమైన హైప్ ఉంది. ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఆయన ఓపెన్ గా ఏది చెప్పకపోయినా, కేవలం వారి కాంబినేషన్‌నే విన్నా ఆడియన్స్‌లో ఎక్సైట్మెంట్ ఎలా పెరుగుతుందో అందరికీ తెలుసు. హీరోయిన్గా తృప్తి దిమ్రిని ఇప్పటికే ఫైనలైజ్ చేశారు. అయితే ఇప్పుడు కీలకమైన మరో రోల్ కోసం మలయాళ బ్యూటీని తీసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆమె మరెవరో కాదు, మడోన్నా సెబాస్టియన్. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె, తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. క్లాస్ లుక్స్‌తో పాటు మాస్ ఆడియన్స్‌కి కూడా ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటి ఆమె. అందుకే ఈ పాత్రకి ఆమెనే సరిపోతారని సందీప్ రెడ్డి వంగా ముందే నిర్ణయించారట. స్టోరీ విన్న తర్వాత మడోన్నా కూడా వెంటనే ఓకే చెప్పేసిందని సమాచారం.ఇప్పటికే ఈ కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో పలు పోస్టులు వస్తున్నాయి. వాటిని చూసిన అభిమానులు “ఇది గ్రేట్ ఆప్షన్.. క్లాస్ అండ్ మాస్‌ని ఒకేసారి కనెక్ట్ చేసే నటి ఆమె. ప్రభాస్ పక్కన ఇలాంటివాళ్లని చూడటం థ్రిల్లింగ్‌గా ఉంటుంది” అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మడోన్నా ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో తన అందం, న్యాచురల్ నటనతో మంచి మార్కులు తెచ్చుకుంది. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించడం ఆమె కెరీర్‌కి మరో పెద్ద మలుపు అవుతుందని అభిమానులు అంటున్నారు. మరోవైపు, సందీప్ రెడ్డి వంగా చేసే స్టోరీ సెలెక్షన్, క్యారెక్టర్ డిజైన్ ఎంత బలంగా ఉంటుందో అందరికీ తెలుసు. కాబట్టి మడోన్నా పాత్రలో ఆయన ఏమి కొత్తగా చూపించబోతున్నారో అన్న ఆసక్తి కూడా పెరిగిపోయింది.మొత్తం మీద, ప్రభాస్సందీప్ రెడ్డి వంగా – మడోన్నా సెబాస్టియన్ కాంబినేషన్ మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: