రష్మిక విజయ్ దేవరకొండ ల ఎంగేజ్మెంట్ నిన్న అనగా శుక్రవారం రోజు అత్యంత సన్నిహితుల సమక్షంలో రహస్యంగా జరిగినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు రష్మిక విజయ్ దేవరకొండల ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఒక్క ఫోటో కూడా సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో లీక్ అవ్వలేదు. చాలా రహస్యంగా వీరు తమ నిశ్చితార్ధ వేడుకను కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.అలాగే ఈ ఎంగేజ్మెంట్ వేడుక కొద్ది మంది సన్నిహితుల మధ్య విజయ్ దేవరకొండ ఇంట్లో నిన్న రాత్రి జరిగినట్టు సమాచారం. ఇక వీరి పెళ్లికూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఉండబోతున్నట్టు సమాచారం. అయితే వీరి ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా ఎందుకు చేసుకున్నారో తెలియదు కానీ తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అదేంటంటే..సెలబ్రెటీల జాతకాలు చెప్పే వేణు స్వామి రష్మిక విజయ్ దేవరకొండ జాతకం గురించి కూడా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్మిక కి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని నేనే చెప్పాను. ఆమె ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాకే వరుస అవకాశాలు చుట్టుముట్టడమే కాకుండా ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోయిన్ గా స్టార్ స్టేటస్ సంపాదించింది. అలాగే విజయ్ దేవరకొండ తో పెళ్లి వద్దని ఎంత వారించి మొత్తుకున్నా కూడా ఆమె పట్టించుకోలేదు.అప్పటివరకు నేను చెప్పినట్లు విన్నది. కానీ విజయ్ దేవరకొండ తో పెళ్లి వద్దు అంటే మాత్రం వినలేదు.ఎవరి కర్మ వారికే వదిలేస్తున్నాను . వీరు పెళ్లి చేసుకుంటే ఏం లాభం కలిసి ఉండే యోగం ఉండదు.

 కచ్చితంగా విడాకులు తీసుకుంటారు. ఒకవేళ వీరిద్దరూ విడాకులు తీసుకోకుండా ఉండాలంటే కొన్ని రెమిడీస్ ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వమని చెబితే వీళ్ళు పట్టించుకోలేదు. నేను చెప్పినట్లు విని ఉంటే బాగుండేది. కానీ పట్టించుకోలేదు కాబట్టి కచ్చితంగా వీరికి విడాకులే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వేణు స్వామి. మరి వేణు స్వామి చెప్పినట్టు సమంత నాగచైతన్యలలాగే రష్మిక విజయ్ దేవరకొండ జంట అవుతుందా..వీరు కూడా విడాకులు తీసుకుంటారా అనేది ముందు ముందు చూడాలి.అయితే వేణు స్వామి గతంలో మాట్లాడిన ఈ వీడియో మళ్లీ రష్మిక విజయ్ లు ఎంగేజ్మెంట్ చేసుకున్నారని తెలియడంతో వైరల్ అవ్వడంతో చాలామంది ఈ వీడియో పై పైర్ అవుతున్నారు. కనీసం పెళ్లికూడా చేసుకోలేదు అప్పుడే విడాకులు అని చెప్పడం ఏంటో అంటూ మండి పడుతున్నారుm

మరింత సమాచారం తెలుసుకోండి: