టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్ జరిగింది అని గత రెండు మూడు రోజుల నుండి కుప్పలు తెప్పలుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ హీరోగానీ రష్మిక మందన్నా గానీ కనీసం చిన్న క్లారిటీ కూడా ఇవ్వడం లేదు. సోషల్ మీడియా మొత్తం వీరిద్దరి ఎంగేజ్మెంట్ వార్తల గురించి  టాం టాం అని వార్తలు మార్మోగిపోతూ ఉంటే ఈ జంట  కనీసం స్పందించకపోవడం నిజంగా అభిమానులను నిరాశపరిచే వార్తే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలు రహస్యంగా పెళ్లి లేదా ఎంగేజ్మెంట్ చేసుకున్నా కూడా ఇలాంటి వార్తలు వినిపిస్తే ఖచ్చితంగా ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తారు.కానీ ఈ జంట మాత్రం రెండు మూడు రోజుల నుండి వరుస రూమర్స్ వచ్చినా కూడా క్లారిటీ ఇవ్వడం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ తర్వాత మొదటిసారి బయటికి వచ్చి పుట్టపర్తికి ఫ్యామిలీతో కలిసి వెళ్లి సత్య సాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక షాకింగ్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అదేంటంటే పుట్టపర్తి కి వెళ్లిన సమయంలో విజయ్ దేవరకొండ చేతి వేలికి ఓ గోల్డెన్ కలర్ లో ఉన్న రింగు కనిపించింది.ఇక దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో డౌటే లేదు విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాల ఎంగేజ్మెంట్ నిజంగానే జరిగింది..ఇన్ని రోజులు విజయ్ దేవరకొండ చేతి వేళ్లకు కనిపించని రింగు ఇలా సడన్ గా ఎలా వచ్చింది..

అది ఎంగేజ్మెంట్ రింగే అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్స్.. ఇక ఎంగేజ్మెంట్ జరిగింది అనే వార్తలు వినిపించిన తర్వాత నెక్స్ట్ డే రష్మిక మందన్నా తన సోషల్ మీడియా ఖాతాలో 'నాకు తెలుసు మీరు అందరు దీని గురించే వెయిట్ చేస్తున్నారని' పోస్ట్ పెట్టినట్లే పెట్టి తన మూవీ ది గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చింది. కానీ చాలామంది మాత్రం తన ఎంగేజ్మెంట్ గురించి చెబుతుందని భావించారు.అలా ఓ పక్క సినిమా మరో పక్క తన ఎంగేజ్మెంట్ గురించి కూడా ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చిందని అనుకున్నారు.అలా ఈ జంట ఎంగేజ్మెంట్ గురించి అధికారికంగా ప్రకటించకుండా అభిమానులను నిరాశ పరుస్తున్నారని చాలామంది వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: