టాలీవుడ్ హీరో రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఎన్నో చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించి ఆ తర్వాత హీరోగా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోగా పేరు సంపాదించారు. ఇప్పటికి తన సినిమాలతో ఎంతోమంది అభిమానులను అలరిస్తున్న రవితేజ కెరియర్ లో కూడా ఎన్నో హిట్ ఫ్లాప్ లు ఉన్నాయి. అయితే కొన్ని చిత్రాలు మాత్రం బాగున్న ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఆ సినిమాలు రవితేజకు చాలా ఇష్టమట. రవితేజ నటించిన మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. ఇందులో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఇష్టమైన సినిమాల గురించి తెలిపారు రవితేజ.


రవితేజ మాట్లాడుతూ.. తాను రీసెంట్ గా నటించిన ఈగల్ సినిమా తన ఫేవరెట్ సినిమా అని ఇందులో తాను చేసిన పాత్ర తనకి బాగా నచ్చిందని, కానీ ఎందుకో జనాలకు నచ్చలేదు మంచి ఐడియా అది , జనాలకు సినిమా నచ్చకపోతే మనమేమి చేయలేము అంటూ తెలిపారు. అలాగే తాను నటించిన నా ఆటోగ్రాఫ్ మెమోరీస్ సినిమా కూడా తనకు చాలా ఇష్టమని ,కానీ ఆ సినిమా ఆడలేదని తెలియజేశారు. అలాగే గతంలో తను నటించిన నేనింతే సినిమా కూడా  అలాగే కానీ ఎందుకో జనాలకు నచ్చలేదంటూ తెలియజేశారు.


తన సినీ లైఫ్ లో నేనింతే, నా ఆటోగ్రాఫ్ మెమోరీస్ సినిమాలు ఇప్పుడు క్లాసికల్ గా మిగిలాయి , మరికొన్ని ఏళ్లకు ఈగల్ సినిమా కూడా అలాగే క్లాసికల్గా అవుతుందేమో అంటూ తెలిపారు. ఈగల్ సినిమా మంచి పాయింట్ సాంకేతికపరంగా కూడా అన్ని బాగున్నాయి, కానీ స్క్రీన్ ప్లే తో జనాలు కాస్త కన్ఫ్యూజన్ అయ్యారని, కథని ముక్కలు ముక్కలుగా చెప్పడం కాకుండా మామూలు స్క్రీన్ ప్లే తో చెప్పి ఉంటే బాగుండేదేమో బాగుండేదేమో అని తన అభిప్రాయంగా తెలియజేశారు రవితేజ.. మరి రవితేజ అనుకున్నట్టుగా ఈగల్ సినిమా క్లాసికల్ సినిమాగా మిగులుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: