సిద్ధు జొన్నలగడ్డ , రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కాంబినేషన్లో అక్టోబర్ 17వ తేదీన విడుదల కాబోతున్న చిత్రం తెలుసు కదా. ఈ చిత్రంతో డైరెక్టర్ గా మారబోతోంది నీరజా కోన. తన మొదటి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్ధమయ్యింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా తాజాగా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని విడుదల చేశారు.
ట్రైలర్ విషయానికి వస్తే.. నువ్వు ఏ రోజైతే ఆడవాళ్లకు నీ కన్నీళ్లు, నీ బాధ చూపిస్తావో ఆరోజు నువ్వే నీ జుట్టు తీసుకువెళ్లి ఆడవాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది బ్రదర్, ఆ కంట్రోల్ ఎప్పుడు వాళ్ళకి ఇవ్వద్దు అంటూ సిద్ధు చెప్పే డైలాగ్ తో మొదలవుతుంది. ఆ తర్వాత శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా తో చేసేటువంటి రొమాంటిక్ సన్నివేశాలు ట్రైలర్లో యూత్ ని బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ సినిమా అంటేనే కిస్ వంటివి కనిపిస్తూ ఉంటాయి. ట్రైలర్లో ముద్దులు చాలానే ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. రాశి ఖన్నా కూడా ఇందులో కొంతమేరకు గతంలో సినిమాలలో కంటే భిన్నంగా నటిస్తున్నట్లు కనిపిస్తోంది. శ్రీనిధి శెట్టి కూడా మరొకసారి ఆకట్టుకున్నట్టు కనిపిస్తోంది.
తెలుసు కదా సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఏ మేరకు సిద్దు జొన్నలగడ్డకు, అటు శ్రీనిధి శెట్టి , రాశి ఖన్నాకు కెరియర్ కు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి. ప్రస్తుతం ట్రైలర్ అయితే వైరల్ గా మారింది. డైరెక్టర్ నీరజ కోన ఎవరో కాదు వెంకటేష్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈమె గతంలో ఎన్టీఆర్ నటించిన బాద్షా చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది. ఆ తర్వాత ఎంతోమంది హీరోల చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన ఇమే ఇప్పుడు డైరెక్టర్గా మారబోతోంది.