కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2022లో వచ్చిన కాంతార చిత్రంతో భారీ క్రేజ్ అందుకున్నారు. ఇటీవల ఆ చిత్రానికి ఫ్రీక్వల్ గా అక్టోబర్ రెండవ తేదీన విడుదలైన కాంతార చాప్టర్ 1 చిత్రంతో మరొకసారి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. యాక్టర్, డైరెక్టర్ గా తనని తాను నిరూపించుకున్నారు రిషబ్ శెట్టి. తనదైన నెగిటివిటీ టచ్ తో ,భక్తి ,ప్రకృతి, గ్రామీణ సంస్కృతి కలగలిపిస్తూ చూపించిన తీరు ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇప్పటికీ థియేటర్లో కాంతార చాప్టర్ 1 సినిమా హౌస్ ఫుల్ గానే రన్ అవుతోంది.


ఇప్పటికే రూ.510 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం తాజాగా చిత్ర బృందం దీపావళి పండుగకు ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి కొత్త ట్రైలర్ ని అక్టోబర్ 16వ తేదీన మధ్యాహ్నం 12:07 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ కొత్త ట్రైలర్లో ఎలాంటి విజువల్స్ చూపిస్తారు ,ఎలాంటి సీన్స్ ఉంటాయనే విషయంపై అభిమానులకు చాలా ఆసక్తి పెరిగిపోతోంది.

ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా, జయరాయ్, గుల్షన్ దేవయ్య, మరి కొంతమంది నటీనటులు నటించారు సంగీతాన్ని అజినేష్ లోక్నాథ్ అందించారు. గ్రామీణ నేపథ్యం ,ఫోక్ మ్యూజిక్ తో పాటుగా అద్భుతమైన ఆడియో అనుభూతిని అందించారు. ఈ చిత్రాన్ని కూడా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. మరి మొత్తానికి దీపావళికి మాత్రం సడన్ సర్ప్రైజ్ తో అభిమానులను ఖుషీ చేయడానికి సిద్ధమయ్యింది చిత్ర బృందం. మరి ఏ మేరకు అభిమానులను ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంటుందో చూడాలి మరి. కలెక్షన్స్ తో దూసుకుపోతున్న కాంతార చాప్టర్ 1 చిత్రం రాబోయే రోజుల్లో 1000 కోట్ల టార్గెట్ ని రీచ్ అవుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: