
అయితే అనుకోకుండా వరుస సినిమాలు ఫ్లాపులు అవడంతో ఈమె కెరియర్ ఒక్కసారిగా పడిపోయింది. కెరియర్ ప్రారంభంలో కృతి శెట్టి కాస్త బొద్దుగా కనిపించేది కానీ ప్రస్తుతం మాత్రం చాలా సన్నగా మారడంతో ఫేస్ కూడా పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది. వైట్ కలర్ చీరలో ఉన్న ఫోటోలను షేర్ చేయగా ఆ మార్పులు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలలో కృతి శెట్టి ఫేస్ పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోందని నెటిజెన్స్ తెలుపుతున్నారు. ఈ ఫోటోలు చూసిన చాలామంది సర్జరీ ఫేస్ లాగా కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ కొత్త లుక్ చూసి షాక్ అవుతున్నారు. కృతి ఏంటి ఇలా మారిపోయావు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కృతి శెట్టి సంబంధించి ఈ మార్పులు ఆమె కెరియర్ కు ఏ విధంగా ఉపయోగపడతాయో చూడాలి మరి. ప్రస్తుతం అయితే కృతి శెట్టి సినిమా అవకాశాల కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకున్న అవకాశాలు రాకపోవడంతో పలు చిత్రాలలో సెకండ్ హీరోయిన్ గా కూడా నటించడానికి సిద్ధమయ్యింది. తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలోనే పలు సినిమాలలో నటిస్తోంది.తెలుగులో చివరిసారిగా మనమే సినిమాలో కనిపించింది.