బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించి హీరోయిన్గా పేరు సంపాదించిన సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన జటాధర అనే చిత్రంలో నటించింది. ఇందులో విలన్ పాత్రలో కనిపించబోతున్న ఈమె ఈ సినిమా నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదంతా పక్కన పెడితే సోనాక్షి సిన్హా పైన గత కొద్దిరోజులుగా ప్రెగ్నెన్సీ రూమర్సు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవలే తన భర్తతో కలిసి దివాలి బాష్ కు హాజరయ్యింది.


అయితే ఈ వేడుకలలో అనార్కలి డ్రస్సులో కనిపించిన సోనాక్షి సిన్హా మరొకసారి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించగా ఈ విషయంపై నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేయడంతో తాజాగా తన ప్రెగ్నెన్సీ వస్తున్న వార్తల పైన సోనాక్షి సిన్హా విభిన్నంగా స్పందించింది. మానవ చరిత్రలోనే ప్రెగ్నెన్సీలో తాను ప్రపంచ రికార్డు అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం తాను ఇప్పటికే 16 నెలలు గర్భంతో ఉన్నానంటూ వెటకారంగా రాసుకొచ్చింది. కేవలం ఉదర భాగంపై చేయి వేసి ఫోటో దిగినందుకే ఇలాంటి రూమర్స్ సృష్టించారంటూ క్లారిటీ ఇచ్చింది. అలాగే ఈ శుభవార్తను దీపావళి వరకు కొనసాగించండి అంటూ ఫన్నీగా రియాక్షన్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.



తమ మీద వస్తున్న వార్తల పైన మా స్పందన ఇలాగే ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది సోనాక్షి సిన్హా. 2024లో జహీర్ ఇగ్బాల్ ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది. అదే ఏడాది జులైలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని చూడడానికి వెళ్ళిన సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి, ఆ తర్వాత కొద్ది రోజులకు బరువు పెరగడంతో అదే ఏడాది మళ్లీ ప్రెగ్నెంట్ రూమర్స్ వినిపించాయి. ఇలా ఎప్పటికప్పుడు ఈ విషయాలను ఖండిస్తూ వస్తున్న సోనాక్షి సిన్హా తాజాగా చేసిన కామెంట్స్ మరొకసారి వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: