
అదేమిటంటే రామాయణం ట్రైలర్ శాన్ డియాగో కామిక్ కాన్ లో 2026లో విడుదల చేయబోతున్నాం అంటూ ప్రకటించారు. అభిమానులు కూడా ఈ విషయం పైన చాలా ఉత్సాహంగానే ఎదురు చూస్తున్నారు. కామిక్ కాన్ ఈవెంట్ కేవలం శాన్ డీయగోలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల జరుగుతుంటాయి. అమెరికా, చికాగో, న్యూయార్కు వంటి నగరాలలో ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా నిర్వహిస్తుంటారు. ఇండియా విషయానికి వస్తే ముంబై, హైదరాబాద్, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలలో ఈవెంట్ ని చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఈవెంట్లో ప్రధానంగా కామిక్ పుస్తక ఆధారిత కంటెంట్ పై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. శాన్ కామిక్ కాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద పాప్ సంస్కృతి కలిగిన కార్యక్రమని ఇందులో ఎక్కువగా వీడియో గేమ్స్, కామిక్స్, యానిమేషన్ కంటెంట్, టీవీ షోలు ఇతర చిత్రాల పైన ప్రత్యేకమైన దృష్టి పెడతారని తెలుస్తోంది. ఇక్కడ ప్రీమియర్ అయ్యే సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు వీక్షిస్తారు. అలాగే సైన్స్ ఫిక్షన్ ,యానిమేషన్ ,ఫాంటసి చిత్రాల ఆధారంగా తీసే ప్రాజెక్టులు ఈ ప్లాట్ ఫాం కోసం ఎక్కువగా ఆశిస్తాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రామాయణం ట్రైలర్ ను కామిక్ కాన్ లో విడుదల చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేశారు.