టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో పాపులర్ అయిన సిద్దు జొన్నలగడ్డకు జాక్ సినిమాతో భారీ షాక్ తగిలింది. ఊహించని స్థాయిలో జాక్ సినిమా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఒకే తరహా పాత్రలను ఎంచుకోవడం కూడా సిద్దు జొన్నలగడ్డ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతోందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

ఇలాంటి తరుణంలో తెలుసు కదా సినిమాతో సిద్దు జొన్నలగడ్డ  ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా  నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కొత్తగా ఉన్నాయి.  క్యాస్టూమ్ డిజైనర్ గా పాపులర్ అయిన నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా లక్ పరీక్షించుకున్నారు. బాక్సాఫీస్ వద్ద తెలుసు కదా ఎలాంటి ఫలితాన్ని అందుకుంది?  ఈ సినిమా సిద్దు జొన్నలగడ్డ కోరుకున్న భారీ సక్సెస్ ను అందించిందా? ఇప్పుడు చూద్దాం.

కథ :

అనాథ అయిన వరుణ్ (సిద్దు జొన్నలగడ్డ)  స్వయంకృషితో కెరీర్ పరంగా  ఎదుగుతాడు. అయితే తనకో అందమైన కుటుంబం ఉండాలని భార్య, పిల్లలతో సంతోషంగా జీవనం గడపాలని వరుణ్ భావిస్తాడు.  అయితే పెళ్లిపై సదభిప్రాయం లేని రాగ (శ్రీనిధి శెట్టి)  కొన్ని కారణాల  వల్ల వరుణ్ తో బ్రేకప్ చేసుకుంటుంది.  ఆ తర్వాత వరుణ్ అంజలిని (రాశిఖన్నా) ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు.  అయితే   ఈ జంటకు    పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఆ సమయంలో రాగ మళ్ళీ వరుణ్ జీవితంలోకి వస్తుంది.  పిల్లలు పుట్టడం  కోసం అంజలి తీసుకున్న నిర్ణయమేంటి? వరుణ్ కోరిక నెరవేరిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

విశ్లేషణ :

తెలుసు కదా మూవీ  టీజర్, ట్రైలర్ చుసిన సమయంలో చాలామంది ఈ    సినిమాను నిన్ను కోరి సినిమాతో పోల్చి చూశారు.  వాస్తవానికి కథ, కథనం విషయంలో నిన్ను కోరి సినిమాకు  ఈ సినిమాకు ఏ మాత్రం పోలిక లేదు. దర్శకురాలు నీరజ కోన తొలి  సినిమా అయినప్పటికీ ఈ సినిమాను  అద్భుతంగా తెరకెక్కించారు. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా తెలుసు కదా మూవీ ఉంది.  వైవా హర్ష  ఈ సినిమాలో కనిపించిన ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉంది.

సిద్దు జొన్నలగడ్డ గత సినిమాలతో పోల్చి చూస్తే  ఈ సినిమాలో నటన పరంగా కొత్తదనం చూపించాడు.  రాశిఖన్నా, శ్రీనిధి శెట్టి తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.  ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. నిడివి 2 గంటల 20 నిమిషాల కంటే  తక్కువగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది.  థమన్ మల్లిక గంధ సాంగ్ తో పాటు ఇతర సాంగ్స్ తో సైతం మెప్పించాడు.

పరిమిత సంఖ్యలో పాత్రలే తెరపై కనిపించినప్పటికీ తెలుసు కదా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు.  సినిమాకు డైలాగ్స్ మరింత ప్లస్ అయ్యాయి.   "కాసేపు ఏం మాట్లాడొద్దు.. నీ సైలెన్స్ వినాలని ఉంది" లాంటి సింగిల్ లైన్ డైలాగ్స్ సినిమా స్థాయిని పెంచాయి.  ఇద్దరు హీరోయిన్లతో సిద్దు  కెమిస్ట్రీ అదిరిపోయింది.  ఈ సినిమా తర్వాత వైవా హర్షకు మూవీ ఆఫర్లు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.

 జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో బిగ్గెస్ట్ అస్సెట్  అని చెప్పవచ్చు.  ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమా స్థాయిని  పెంచాయి. ఎడిటర్ నవీన్ నూలిసినిమా కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు.  టాలీవుడ్ లో ప్రస్తుతం నంబర్ వన్ ఎడిటర్ నవీన్ నూలి  అని చెప్పడంలో  సందేహం అక్కర్లేదు.  ఈ సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో నీరజ కోనకు  టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు పెరిగే అవకాశాలున్నాయి.

బలాలు : సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్, ఫస్టాఫ్, సాంగ్స్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్

బలహీనతలు : కొన్ని సన్నివేశాల్లో ల్యాగ్

రేటింగ్ : 3.0/5.0

మరింత సమాచారం తెలుసుకోండి: