కొండా సురేఖకు జరిగిన అన్యాయం గురించి తన కూతురు మీడియా సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి బండారం బయట పెడుతూ అదంతా రేవంత్ రెడ్డి,పొంగులేటి,వేం నరేందర్ రెడ్డిలు చేయించిన పనే అంటూ బల్ల గుద్ది చెబుతోంది.ఈ నేపథ్యంలోనే తాజాగా మీడియా ముందు మాట్లాడుతూ మా దగ్గర పని చేసే సుమంత్ కి థ్రెట్ ఉంది.వాడి మీద మర్డర్ అటెంప్ట్స్ జరిగాయి. అడిగితే వాళ్ళకి గన్ మెన్ లను ఇవ్వరు. రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎందుకు గన్ మెన్లు ఉన్నారు. కొండల్ రెడ్డి,తిరుపతి రెడ్డిలకు గన్మెన్లు ఎందుకు.. సుమంత్ రోహిన్ రెడ్డిని గనిపెట్టి బెదిరించాడని అంటున్నారు.అది రోహిన్ రెడ్డి చెప్పారా.. దక్కన్ సిమెంట్స్ గురించి సీఎం చెబితేనే సీఎం ప్రధాన అనుచరుడు రోహిన్ రెడ్డి సుమంత్ ని తన ఆఫీస్ కి పిలిపించుకున్నారు. రోహిన్ రెడ్డి ఆఫీసులోనే ఈ చర్చ జరిగింది.

 సుమంత్ గన్ పెట్టి బెదిరించాడని అంటే అది చెప్పాల్సిందే రోహిన్ రెడ్డి కదా..రోహిన్ రెడ్డి ఏమి చెప్పడం లేదు..ఆ గన్ సీఎం ఇచ్చారా.. ఇందులో ఏం లేదు.. ఇదంతా బీసీ మంత్రులను తొక్కేయడానికే రేవంత్ రెడ్డి పొంగులేటి చేస్తున్న కుట్రలు.. మేము తెలుగుదేశంలో కొట్లాడం, టిఆర్ఎస్ లో కొట్లాడాం,కానీ సొంత గవర్నమెంట్ ఉన్న టైంలో కూడా ఇలాంటి వేధింపులు వస్తాయని మేము ఊహించలేదు. ఈ ఇష్యులోకి మా అమ్మ నాన్నని లాగితే బాగుండదు. సుమంత్ మా ఫ్యామిలీ మెంబర్..వాడు ఎప్పటినుండో మా దగ్గర నమ్మకంగా ఉన్నాడు.వాడికి ఏమైనా హాని జరిగితే గవర్నమెంట్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

వాడికి ఏమైనా ఆ బాధ్యత అంతా పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డిలదే.వాడికి ఏం జరిగినా మీ ముగ్గురిదే బాధ్యత.. సుమంత్ ని పిలిచింది రోహిన్ రెడ్డి కాబట్టి సుమంత్ ఎక్కడ ఉంటే రోహిన్ రెడ్డి కూడా అక్కడే ఉండాలి..అంటూ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేసింది కొండా సురేఖ కూతురు.. ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.దీని వెనక రేవంత్ రెడ్డి హస్తం ఉంది అని ఆమె బహిరంగంగానే మీడియా ముందు చెప్పడంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: