- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్‌లో కొత్త కాన్సెప్ట్‌లకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ తనదైన స్టైల్‌లో సినిమాలు చేసుకునే హీరో సుధీర్ బాబు ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమా “జటాధర”. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలుగులో ఎంట్రీ ఇస్తుండటంతోనే ఈ ప్రాజెక్ట్‌పై ప్రారంభం నుంచే మంచి ఆసక్తి నెలకొంది. దర్శకులు వెంకట్ కళ్యాణ్ మరియు అభిషేక్ జైస్వాల్‌ కలిసి రూపొందించిన ఈ థ్రిల్లర్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్‌తో భారీ బజ్ సృష్టించింది.
ఇటీవల విడుదలైన “జటాధర” ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. సాధారణంగా చాలా సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్‌కి ప్రాధాన్యత ఇస్తారు... కానీ ఈ సినిమాలో మాత్రం కంటెంట్ ప్రధాన బలం అని ట్రైలర్ స్పష్టంగా చెప్పేస్తోంది.


సుధీర్ బాబు యాక్షన్ మరియు ఎమోషన్‌ల మేళవింపుతో కూడిన తన పాత్రలో కొత్తదనాన్ని చూపించాడు. సోనాక్షి సిన్హా కూడా తన ఇంపాక్ట్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. ప్రేక్షకులు ట్రైలర్ చూసిన వెంటనే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. “ ఇలాంటి కాన్సెప్ట్ థ్రిల్లర్ టాలీవుడ్‌లో చాలాకాలం తర్వాత వస్తోంది ” అని కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్‌కు ముందు వరకు సాధారణ స్థాయిలో ఉన్న ఈ సినిమాకి, ఇప్పుడు అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా సస్పెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అన్నీ కూడా హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని సినీ ప్రేమికులు అంటున్నారు.


సినిమా లో శుభలేఖ సుధాకర్, శ్రీనివాస్ అవసరాల వంటి అనుభవజ్ఞులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిస్టరీ, డ్రామా, ఎమోషన్‌ల మేళవింపుతో “ జటాధర ” ఒక న్యూ ఏజ్ థ్రిల్లర్‌గా నిలవబోతోందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ నవంబర్ 7న తెలుగు మరియు హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ సినిమా, సుధీర్ బాబు కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలుస్తుందని ట్రేడ్ సర్కిల్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: