గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “అఖండ 2” కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2021లో విడుదలైన “అఖండ” సినిమా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, బాలయ్య కెరీర్‌లోనే కాదు, టాలీవుడ్ మాస్ సినిమాల చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. అదే కాంబినేష‌న్‌లో ఇప్పుడు దర్శకుడు బోయపాటి శ్రీను - బాలకృష్ణ క‌లిసి చేస్తోన్న‌ ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాలయ్య మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, బోయపాటి దర్శకత్వ శైలి, థ‌మన్ మ్యూజిక్ ఈ మూడింటి కాంబినేషన్ ప్రేక్షకులలో అపారమైన హైప్ క్రియేట్ చేసింది. ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే, “అఖండ 2”  కేవలం సినిమా కాదు, బాలయ్య తాండవం. అయితే, ఈ తాండవానికి మరింత బలాన్ని ఇచ్చేది సరైన ప్రమోషనల్ స్ట్రాటజీ అని చాలా మంది భావిస్తున్నారు.


ఇప్పటివరకు మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఒక గ్లింప్స్ మాత్రమే అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆ చిన్న వీడియోలోనే బాలయ్య ఆధ్యాత్మిక , పవర్‌ఫుల్ డైలాగ్స్ , మాస్ ఎంట్రీ అన్నీ కలిపి అద్భుతమైన ఫీల్ ఇచ్చాయి. కానీ సినిమాకు రిలీజ్‌కు కేవలం 50 రోజులు మాత్రమే ఉండగా , ప్రమోషనల్ యాక్టివిటీలు మాత్రం సైలెంట్‌గా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం, “అఖండ 2”లాంటి భారీ ప్రాజెక్ట్‌కి రీచ్ పెంచాలంటే, కనీసం రిలీజ్‌కు రెండు నెలల ముందు నుంచే అగ్రెసివ్ ప్రమోషన్ అవసరం. ట్రైలర్, సాంగ్స్, ఇంటర్వ్యూలు, ఈవెంట్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్ వంటివి పబ్లిక్ ఇంటరెస్ట్‌ మరింత పెంచుతాయి.


ఈ లెవల్ ప్రాజెక్ట్‌కు మేకర్స్ నుంచి క్రమంగా అప్‌డేట్స్ రావడం అవసరం అని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు.
ఇక బోయపాటి శ్రీను దర్శకత్వం అంటేనే పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌లు, మాస్ డైలాగ్స్, గ్రాండ్ విజువల్స్ అన్నీ తప్పక ఉంటాయని ఆడియెన్స్ నమ్మకం. “అఖండ 2”లో ఇవన్నీ మరోస్థాయిలో ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సీక్వెల్‌లో బాలయ్య పాత్ర మరింత డైమెన్షన్‌తో, ఆధ్యాత్మిక స్పర్శతో కనిపించబోతుందట.
సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటినుంచే ప్రోమోషన్లపై ఫోకస్ పెంచితే, బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విష‌యంలో బోయ‌పాటి మిస్టేక్‌లు చేయ‌కుండా ప్రమోష‌న్లు పెంచుతార‌ని ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: