టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ప్రభాస్ కు బర్తడే విషెస్ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ నటించిన సినిమాల అప్డేట్ విషయం పైన కూడా అభిమానులు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. అలాంటివారి కోసం తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి ప్రభాస్ కు మ్యాష్ ఆఫ్ వీడియోతో బర్తడే విషెస్ తెలుపుతూ ఒక సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది.


ముఖ్యంగా ప్రభాస్ చేసిన సినిమాలకు సంబంధించి చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి బ్యాగ్రౌండ్ లో డైలాగ్ ను యాడ్ చేశారు. అర్జునుడు లాంటి రూపం శివుడు లాంటి బలం  అభిమన్యుడు లాంటి పౌరుషం  అంటూ సాగే వీడియో కూడా అభిమానులను చాలా ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ వీడియో చూసిన అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ వంటి స్టార్ హీరో, గీతా ఆర్ట్స్ బ్యానర్ స్పెషల్ వీడియోని షేర్ చేసిందంటే కచ్చితంగా ఏదైనా ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యిందా అనే విధంగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ విషయం పైన అఫీషియల్ గా అల్లు అరవింద్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.


ఇప్పటికే ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వచ్చేయేడాది సంక్రాంతి బరిలో ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా ఉండబోతోంది. అలాగే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే చిత్రంలో కనిపించబోతున్నారు. వీటితో పాటుగా సలార్ 2, డైరెక్టర్ హానురాగవపూడి డైరెక్షన్లో మరొక సినిమాలో చేయబోతున్నారు. కల్కి 2 చిత్రంలో కూడా నటించబోతున్నారు. మొత్తానికి బర్తడే ట్రీట్ కి సంబంధించి గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి ఈ వీడియో హైలెట్ గా మారింది. మరి ప్రభాస్ తదుపరి సినిమాల అప్డేట్స్ వస్తాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: