 
                                
                                
                                
                            
                        
                        గోపాలకృష్ణన్ మాట్లాడుతూ.. మద్రాస్ మెడికల్ కాలేజీలో 2023 ఆగస్టు ,సెప్టెంబర్ నెలలో క్షేత్రస్థాయి సర్వేలను నిర్వహించామని ఇందులో తమిళనాడులోని 125 గ్రామాలకు చెందిన 3,350 మంది రైతుల సంబంధించి మూత్రపిండాల పనితీరు పైన పరిశీలించామని , ఇందులో మళ్లీ 5 వర్గాలుగా విభజించి మరి పరిశీలించామంటూ తెలిపారు గోపాలకృష్ణన్. ఇందులో 17.3% మందికి మూత్రపిండాలు దెబ్బ తిన్నట్లుగా తేలిందంటూ తెలియజేశారు. మళ్లీ మూడు నెలల తర్వాత పరిశీలించగా అప్పుడు 5.31% మాత్రమే తగ్గిందని గుర్తించారు.
అయితే ఇందులో సగం మందికి మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సమస్యలు, జన్యుపరమైన వ్యాధులతో లేదా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కేవలం వీరు ఎండలో పనిచేయడం వల్ల వాటి ప్రభావంతోనే కిడ్నీ వైఫల్యానికి గురవుతున్నారని గుర్తించారు. రైతులే కాకుండా నిర్మాణరంగా పనులలో పని చేసేవారు ,అలాగే ఇటుక బట్టి కార్మికులు నిత్యం ఎక్కువగా వేడి ప్రాంతంలో పనిచేసే వారి శరీరంలో కూడా నీటిని త్వరగా కోల్పోతారు. దీనివల్ల మూత్రపిండాలంపై ఇది తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని గోపాలకృష్ణన్ తెలియజేశారు. అందుకే వీలైనంతవరకు రైతులు ఎక్కువగా ఎండ సమయంలో పనిచేయకపోవడమే మంచిదంటూ సలహా ఇస్తున్నారు.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి