స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన  పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించారు. ముఖ్యంగా 69 జాతీయ చలనచిత్ర అవార్డు రావడంతో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఇప్పుడు తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నట్లుగా తెలుస్తోంది అల్లు అర్జున్. ఈ విషయంపై అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ద్వారా తెలియజేయడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ ఏడాది 2025 జరిగిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్  ఫిలిం ఫెస్టివల్ కింద అత్యంత బహుముఖ ప్రజ్ఞశాలి నటుడుగా అల్లు అర్జున్ కు ఈ అవార్డు లభించింది.



ఈ విషయం పైన సినీ సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ ని ప్రశంసిస్తున్నారు. ఈ విషయంపై అల్లు అర్జున్ మాట్లాడుతూ ఇంతటి అద్భుతమైన గౌరవం ఇచ్చిన దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్ర అవార్డుకు ప్రత్యేకించి ధన్యవాదాలు. ఈ విషయం వినడానికి నిజంగా వినయంగా ఉంది, ఇతర విభాగాల విజేతలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు అంటూ మీ నిరంతరం ప్రేమ మరియు మద్దతు తెలిపిన అభిమానులకు ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డు నా అభిమానులకే అంకితం అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చారు.



ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో పాన్ వరల్డ్ లెవెల్లో తన తదుపరిచిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ హీరో కాన్సెప్ట్ తో అల్లు అర్జున్ నటించిన బోతున్నట్లు కనిపిస్తోంది. సుమారుగా రూ .800 కోట్ల రూపాయల బడ్జెట్ తో సన్ పిక్చర్ సమస్త ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో  హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటించబోతోంది. అలాగే మరి కొంతమంది హీరోయిన్స్ నటించబోతున్నట్లు సమాచారం.  ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు  తీసుకురావడానికి చిత్ర బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: